‘జనగణనలో ఓబీసీల కాలమ్‌ చేర్చాలి’ | - | Sakshi
Sakshi News home page

‘జనగణనలో ఓబీసీల కాలమ్‌ చేర్చాలి’

May 11 2026 8:26 AM | Updated on May 11 2026 8:26 AM

పాతమంచిర్యాల: జనగణనలో ఓబీసీల కాలమ్‌ చేర్చాలని డిమాండ్‌ చేస్తూ బీసీ సంఘాల నాయకులు ఆదివారం జిల్లా కేంద్రంలో నల్లబ్యాడ్జీలు ధరించి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా నాయకులు మాట్లాడుతూ ఓబీసీల కులగణన చేపట్టాలనే డిమాండ్‌తో హైదరాబాద్‌లో ప్రభుత్వ సలహాదా రు, మాజీ ఎంపీ హన్మంతరావు చేపట్టిన ఆమరణ నిరాహర దీక్షకు మద్దతు తెలిపారు. ఓబీసీల లెక్కలు లేని జనగణనతో ప్రయోజనం లేదని, జనగణనలో బీసీల సమగ్ర కుల గణన చేపట్టకపోవడం వలన దేశంలోని 80 కోట్ల మంది బీసీలు అర్థికంగా, సామాజికంగా రాజ్యాధికారంలో వాటాలకు నోచుకోలేకపోతున్నారన్నారు. ఈ కార్యక్రమంలో నాయకులు గజెళ్లి వెంకటయ్య, జి.లక్ష్మణ్‌, శ్రీనివాస్‌, రాజేశం, నారాయణ, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement