మంచిర్యాలటౌన్: నీట్ పేపర్ లీకేజీ కేంద్ర ప్రభుత్వ నిర్లక్ష్యం వల్ల జరిగిందని మంచిర్యాల నగర మేయర్ దర్ని మధుకర్, కాంగ్రెస్ పార్టీ మంచిర్యాల కార్పొరేషన్ అధ్యక్షుడు తూముల నరేశ్ విమర్శించారు. నీట్ పేపర్ లీకేజీని నిరసిస్తూ గురువారం కాంగ్రెస్ పార్టీ ఆధ్వర్యంలో ఐబీ చౌరస్తా వద్ద ధర్నా నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ నీట్ పేపర్‌ను లీక్ చేసిన దోషులను చట్టపరంగా శిక్షించాలని, కేంద్ర విద్యాశాఖ మంత్రి ధర్మేంద్ర ప్రధాన్ రాజీనామా చేయాలని డిమాండ్ చేశారు. విద్యార్థుల్లో మరోసారి పరీక్షకు హాజరు కావాలనే ఆందోళన నెలకొందని అన్నారు. పరీక్షల సమయంలో జాగ్రత్తలను కేంద్ర ప్రభుత్వం విస్మరించడం వల్లనే దేశవ్యాప్తంగా నీట్ విద్యార్థులకు ఇబ్బందిగా మారిందని తెలిపారు. ఈ కార్యక్రమంలో డిప్యూటీ మేయర్ సల్ల రమ్య, కార్పొరేటర్లు, ప్రజాప్రతినిధులు, నాయకులు పాల్గొన్నారు.


