లోకేశ్వరం: భైంసా మండలంలోని వాలేగాం గ్రామానికి చెందిన షేక్ వాజీద్ మియా (42) మండలంలోని పంచగుడి గ్రామ సమీపంలోగల గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ఎస్సై అశోక్ తెలిపిన వివరాల ప్రకారం.. వాజీద్ మియా కారు డ్రెవర్‌గా పని చేస్తూ కుటుంబాన్ని పోషించుకునేవాడు. సీమా బేగం–వాజీద్ మి యా దంపతులకు ఆరు నెలల క్రితం కుమార్తె పుట్టింది. పాప అనారోగ్యంతో పుట్టగా వివిధ ఆస్పత్రులు తిరిగి అప్పులు చేసి చికిత్స చేయించినా ఆమెకు నయం కాలేదు. ఈ క్రమంలో షేక్‌వాజీద్ మియా మద్యానికి బానిసయ్యాడు. గురువారం ఉదయం అతిగా మద్యం సేవించి ఇంటికి వచ్చాడు. గమనించిన తల్లి మౌళబీ కొడుకు వాజీద్ మియాను మందలించింది. దీంతో బయటకు వెళ్లిన వాజీద్ మియా రాత్రి వరకు తిరిగి ఇంటికి రాలేదు. శుక్రవారం పంచగుడి వంతెన వద్ద గోదావరి నదిలో అతడి మృతదేహం కనిపించింది. పాప చికిత్స కో సం చేసిన అప్పులు ఎలా తీర్చాలో తెలి యక వాజీద్ మియా పంచగుడి గోదావరి నదిలో దూకి ఆత్మహత్య చేసుకున్నట్లు ఎస్సై తెలిపారు. మృతుడికి భార్య ఇద్దరు కుమారులు, కుమార్తె ఉన్నారు. అతడి మామ షేక్ మోగులా సాబ్ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసి పర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు.
బాసర వంతెన వద్ద మృతదేహం లభ్యం
బాసర: బాసర గోదావరి నది నూతన వంతెన వద్ద శుక్రవారం కుళ్లిన స్థితిలో ఉన్న మృతదేహాన్ని పోలీ సులు గుర్తించారు. మృతుడి వద్ద ఎలాంటి ఆధారాలు లభించలేదని బాసర సీఐ కిరణ్ తెలిపారు. చేతికి సోనా వాచ్, ఒంటిపై తెల్లటి గీతల షర్టు ఉన్న ట్లు పేర్కొన్నారు. ఆచూకీ తెలిసిన వారు పోలీస్‌స్టేషన్‌లో సంప్రదించాలని సూచించారు.


