నల్లవాగు ప్రాజెక్ట్‌ను సందర్శించిన సబ్‌ కలెక్టర్‌ | - | Sakshi
Sakshi News home page

నల్లవాగు ప్రాజెక్ట్‌ను సందర్శించిన సబ్‌ కలెక్టర్‌

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

భీమిని: కన్నెపల్లి మండలం విరపూర్‌ గ్రామ పంచాయతీ పరిధి నల్లవాగు ప్రాజెక్ట్‌ను బెల్లంపల్లి సబ్‌ కలెక్టర్‌ మనోజ్‌ గురువారం సందర్శించారు. ప్రాజెక్ట్‌లో చేపలు పట్టుకునేందుకు గిరిజనులకు హక్కు కల్పించాలని, ముత్తపూర్‌ వారికి ఇచ్చిన లీజు రద్దు చేయాలని దుబ్బగూడెం, రెబ్బెన గ్రామాల ఆదివాసీ గిరిజనులు మంగళవారం ప్రగతిభవన్‌ ప్రజావాణిలో ఫిర్యాదు చేశారు. దీంతో సబ్‌ కలెక్టర్‌ ముత్తపూర్‌ మత్స్యకారులు, దుబ్బగూడెం, రెబ్బెన ఆదివాసీ గిరిజనులతో మాట్లాడారు. ఇరువురు ఎలాంటి గొడవలు పడవద్దని సూచించారు. అనంతరం కన్నెపల్లి తహసీల్దార్‌ కార్యాలయాన్ని సందర్శించి రికార్డులు పరిశీలించారు. తహసీల్దార్‌ రాంచందర్‌, తాండూర్‌ సీఐ దేవయ్య, ఎస్సై భాస్కర్‌రావు, తదితరులు ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement