చింతలమానెపల్లి: ప్రభుత్వ ఉద్యోగం ఇప్పిస్తానని మోసానికి పాల్పడ్డ ఘటన మండలంలోని డబ్బా గ్రామంలో చోటు చేసుకుంది. బాధితుడు గౌత్రె మోహన్ తెలిపిన వివరాల ప్రకారం.. డబ్బా గ్రామానికి చెందిన దూలం చిలుక అనే మహిళ తన బావ బుర్స రంగయ్యకు కాగజ్‌నగర్ మండలంలో అటవీశాఖలో ఉన్నతోద్యోగం ఉందని, అతడు ఉద్యోగాలు ఇప్పిస్తాడని నమ్మించింది. రూ.2లక్షలు ఇప్పిస్తే ఉద్యో గం పెట్టిస్తామనగా నమ్మిన మోహన్ 2019లో రంగయ్యకు ఈ మొత్తాన్ని ముట్టజెప్పాడు. అనంతరం ఉద్యోగం ఇప్పించే ఉన్నతాధికారి కూతురు ఇంటివద్ద శుభకార్యం ఉందని, బంగారం ఇవ్వాలని కోరడంతో మోహన్ రూ.లక్షా 50వేల బంగారం కొని చ్చాడు. 2024 మేలో మరో రూ.2లక్షలు చెల్లించా డు. ఇలా పలు దఫాలుగా రూ.15,16,600 ముట్ట జెప్పాడు. అపాయింట్‌మెంట్ లెటర్ ఇస్తానని చివరగా రూ.4లక్షలు ఇవ్వాలన్నాడు. దీంతో మోహన్ తనకు అపాయింట్‌మెంట్ లెటర్ ఇవ్వాలని పట్టుబట్టగా మోసం బయటపడింది. దీంతో 2025 ఫిబ్రవరిలో చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేశాడు. ఆ సమయంలో మోహన్ వద్ద తీసుకున్న డబ్బులు తిరిగి ఇస్తానని రంగయ్య చెప్పగా కేసు నమోదు కాలేదు. కా గా, ఇప్పటివరకు మోహన్‌కు డ బ్బులు చెల్లించకపోవడంతో అత డు మళ్లీ పోలీసులకు ఫిర్యాదు చే శాడు. కాగా, రెండుసార్లు చీఫ్ కన్జర్వేటర్, హైదరాబాద్ పేరిట రెండు లెటర్లను రంగయ్య బాధితుడికి ఇవ్వడం గమనార్హం. ఈమేరకు గత నెల 13న చింతలమానెపల్లి పోలీస్‌స్టేషన్‌లో కేసు నమోదైంది. ఎస్సై కమలాకర్ విచారణ చేపట్టారు. బుర్స రంగయ్య, దూలం చిలు కను అదుపులోకి తీసుకుని విచారణ చేపట్టారు. చీ ఫ్ కన్జర్వేటర్ ఆఫ్ ఫారెస్ట్, హైదరాబాద్.. పేరిట త యారు చేసిన అపాయింట్‌మెంట్ లెటర్ కాగజ్‌నగర్‌లోని టైప్ ఇనిస్టిట్యూట్‌లో తయారు చేసినట్లు సమాచారం. సదరు ఇనిస్టిట్యూట్ నిర్వాహకుడు కూడా పోలీసుల అదుపులో ఉన్నట్లు తెలిసింది. ఈమేరకు కౌటాల సీఐ సంతోష్‌కుమార్‌ను సంప్రదించగా కేసు విచారణలో ఉందని, వివరాలు త్వరలో వెల్లడిస్తామని పేర్కొన్నారు.


