తూకంలో మోసం | - | Sakshi
Sakshi News home page

తూకంలో మోసం

May 16 2026 1:27 AM | Updated on May 16 2026 1:27 AM

● మిల్లర్లు, ఎమ్మెల్యే ఏకమై దోచుకుంటున్నారు ● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

● మిల్లర్లు, ఎమ్మెల్యే ఏకమై దోచుకుంటున్నారు ● మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు

మంచిర్యాలరూరల్‌(హాజీపూర్‌): మంచిర్యాల నియోజకవర్గంలో ఏర్పాటు చేసిన వరి ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో పంట తూకంలో మోసం అందరికీ తెలిసే జరుగుతోందని మంచిర్యాల మాజీ ఎమ్మెల్యే నడిపెల్లి దివాకర్‌రావు ఆరోపించారు. శుక్రవారం హాజీపూర్‌ మండలం సబ్బేపల్లి, మున్సిపల్‌ కార్పొరేషన్‌ పరిధిలోని గుడిపేటలో వరి ధాన్యం, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను ఆయన పరిశీలించారు. ఒక్కో బస్తా 43కిలోలు తూకం వేస్తున్నట్లు గుర్తించి హమాలీలను ప్రశ్నించారు. నిర్వాహకుల సూచన మేర కు తూకం వేస్తున్నట్లు వారు తెలిపారు. నిర్వాహకురాలిని ఆరా తీయగా 43కిలోల కన్నా తక్కువ తూకం వేస్తే మిల్ల ర్లు నిరాకరిస్తుండడంతో తప్ప డం లేదని తెలిపింది. ఒక్కో బస్తాకు రెండు కిలో ల వరకు అదనంగా తూకం వేయడంతో క్వింటాల్‌కు 7 నుంచి 10 కిలోల వరకు రైతులు నష్టపోతున్నారని మాజీ ఎమ్మెల్యే తీవ్రస్థాయిలో మండిపడ్డారు. రైతులకు తీరని అన్యాయం జరుగుతున్నా స్థానిక ఎమ్మెల్యే పట్టించుకోవడం లేద ని, రైస్‌మిల్లర్లతో కుమ్ముకై ్క దోచుకుంటున్నారని విమర్శించారు. ఒక బస్తాకు గన్నీ బ్యాగు కన్నా ఎక్కువ తూకం వేయకుండా చూడాలని డిమాండ్‌ చేశారు. ఎలాంటి షరతులు లేకుండా మొక్కజొన్న పంటను ప్రభుత్వం కొనుగోలు చేయాలని అన్నారు. మొక్కజొన్న పంటకు ఎకరానికి 26 క్వింటాళ్లు కాకుండా 40 క్వింటాళ్లు తీసుకోవాలని సూచించారు. కాంటా అయిన తర్వాత తరలించడానికి బ్యాగుకు రూ.2 తీసుకోవడం అవినీతికి నిదర్శనమని తెలిపారు. ఎలాంటి షరతులు లేకుండా ధాన్యం కొనుగోలు చేసే వరకు బీఆర్‌ఎస్‌ పార్టీ అండగా నిలుస్తుందని అన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement