ప్రభుత్వానికి కృతజ్ఞతలు | - | Sakshi
Sakshi News home page

ప్రభుత్వానికి కృతజ్ఞతలు

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

రైతులకు ఇబ్బందులు కలుగకుండా స్థానిక ప్రజాప్రతినిధుల చొరవతో ప్రభుత్వం తీసుకున్న నిర్ణయం హర్షణీయం. టెండర్‌ ధాన్యం మొత్తాన్ని 90రోజుల్లో చెల్లించేందుకు తగిన పూచీకత్తుతో ధాన్యం ఇవ్వాలని కోరుతున్నాం. జిల్లాలో సరిపడా మిల్లులు అందుబాటులోకి వస్తే పొరుగు జిల్లాలకు పంపకుండా ఇక్కడి రైతుల ధాన్యాన్ని పూర్తిగా సేకరించే అవకాశం ఉంటుంది.

– ఎర్ర చంద్రశేఖర్‌,

మాజీ జెడ్పీటీసీ, జన్నారం

గడువులోపు చెల్లిస్తాం

టెండర్‌ ధాన్యం సంబంధించి ప్రభుత్వం ఇచ్చిన మూడు నెలల గడువులోపు మొత్తాన్ని చెల్లించేలా ప్రయత్నిస్తున్నాం. ఈ మేరకు యాసంగిలో కొనుగోళ్లకు రైతులకు ఇబ్బంది కలుగకుండా స్థానిక మిల్లులకు ధాన్యం కేటాయించాలి.

– చిలువేరు శ్రీనివాస్‌, అదనపు కార్యదర్శి, జిల్లా మిల్లర్ల సంఘం

Advertisement
 
Advertisement
Advertisement