వరి ధాన్యం త్వరితగతిన తరలించాలి | - | Sakshi
Sakshi News home page

వరి ధాన్యం త్వరితగతిన తరలించాలి

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

పాతమంచిర్యాల: కొనుగోలు కేంద్రాల నుంచి రైస్‌మిల్లులకు వరి ధాన్యం త్వరితగతిన తరలించాలని జిల్లా అదనపు కలెక్టర్‌ రెవెన్యూ వి.రాములు అన్నారు. బుధవారం కలెక్టరేట్‌లో పౌరసరఫరాల అధికారి బ్రహ్మారావు, డీఆర్డీవో కిషన్‌, జిల్లా రవాణా శాఖ అధికారి గోపి, కార్మిక శాఖ సహాయ కమిషనర్‌ క్రాంతి, రైస్‌ మిల్లర్ల అసోసియేషన్‌ అధ్యక్షులు, సెక్టార్‌ 1,2,3,4,లకు సంబంధించిన ట్రాన్సుపోర్టు గుత్తేదారులతో సమీక్ష నిర్వహించారు. రోజుకు 6 మెట్రిక్‌ టన్నుల ధాన్యం కొనుగోలు చేయాలని, కనీసం 10–15 లారీల ధాన్యాన్ని మిల్ల ర్లు దిగుమతి చేసుకోవాలన్నారు. అవసరం మేరకు హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. ధాన్యం తరలింపునకు రవాణా శాఖ ఆధ్వర్యంలో లారీలు ఏర్పాటు చేశామన్నారు.

కొనుగోలు కేంద్రాలు పరిశీలన

దండేపల్లి: మండలంలోని పలు గ్రామాల్లో ఏర్పాటు చేసిన వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను అదనపు కలెక్టర్లు వడాల రాములు, చంద్రయ్య వేర్వేరుగా పరిశీలించారు. తూకం వేసిన బస్తాలను వెంటవెంటనే మిల్లులు, లేదా గోదాంలకు తరలించాలని నిర్వాహకులకు సూచించారు. దండేపల్లిలో వరి, మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలతో పాటు, ధాన్యం నిల్వ చేసేందుకు అల్లీపూర్‌ సమీపంలో గల రామ్‌లక్ష్మన్‌ మిల్లులోని గోదాంలను ఇద్దరు వేర్వేరుగా పరిశీలించారు. రైతులకు ఎలాంటి ఇబ్బందులు తలెత్తకుండా చర్యలు చేపట్టాలని సంబంధిత అధికారులకు సూచించారు. ఆయన వెంట రాష్ట్ర గిరిజన సహకార కార్పొరేషన్‌ చైర్మన్‌ కోట్నాక తిరుపతి, ఆర్‌జీపీఆర్‌ఎస్‌ జిల్లా అధ్యక్షుడు త్రిమూర్తి, తహసీల్దార్‌ రోహిత్‌ దేశ్‌పాండే, ఎంపీడీవో ప్రసాద్‌, ఆర్‌ఐ భూమన్న, ఐకేపీ సిబ్బంది ఉన్నారు.

మొక్కజొన్న కొనుగోలు కేంద్రం తనిఖీ

మండల కేంద్రంలోని మొక్కజొన్న కొనుగోలు కేంద్రాన్ని జిల్లా వ్యవసాయశాఖ అధికారి సురేఖ తనిఖీ చేశారు. లారీల సమస్య ఉందని చెప్పడంతో పంపించే ఏర్పాట్లు చేస్తామన్నారు. ఆమె వెంట ఏడీఏ కృష్ణ, ఏవో అంజిత్‌కుమార్‌ ఉన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement