24 గంటల్లో ఖానాపూర్‌ హత్య కేసు ఛేదన | - | Sakshi
Sakshi News home page

24 గంటల్లో ఖానాపూర్‌ హత్య కేసు ఛేదన

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

● భర్తే హంతకుడిగా తేల్చిన పోలీసులు ● కట్న వేధింపులు, కుటుంబ విభేదాలే హత్యకు కారణమని వెల్లడి

ఖానాపూర్‌: ఖానాపూర్‌ పోలీస్‌స్టేషన్‌ పరిధిలో న మోదైన మహిళ హత్య కేసును నిర్మల్‌ జిల్లా పోలీసులు 24 గంటల్లో ఛేదించారు. ఈ కేసులో మృతురాలి భర్తే హంతకుడిగా తేలింది. నిర్మల్‌ డీఎస్పీ శ్రీనివాస్‌ కేసు వివరాలు వెల్లడించారు. ఆయన తెలిపిన వివరాల ప్రకారం.. మృతురాలు నల్ల మౌనిక అదృశ్యమైనట్లు ఈ నెల 9న మామడ పోలీస్‌స్టేషన్‌లో మి స్సింగ్‌ కేసు నమోదు చేశారు. 14న ఖానాపూర్‌ మండలం తర్లపాడు అటవీ ప్రాంతంలో ఆమె మృతదేహం లభ్యం కావడంతో కేసును హత్య కేసుగా మార్చి పోలీసులు దర్యాప్తు చేపట్టారు. దర్యాప్తులో నల్ల అరుణ్‌ తన భార్య మౌనికను అదనపు కట్నం వేధింపులు, కుటుంబ విభేదాలతోపాటు అక్రమ సంబంధం అనుమానం నేపథ్యంలో ప్లాన్‌ ప్రకారం అటవీ ప్రాంతానికి తీసుకెళ్లి గొంతు నులిమి హత్య చేసినట్లు తేలింది. అనంతరం తనపై అనుమానం రాకుండా ఉండేందుకు గుర్తు తెలియని వ్యక్తులు అత్యాచారం చేసి హత్య చేసినట్లు, బంగారు ఆభరణాలు, విలువైన వస్తువులు దోచుకెళ్లినట్లు చిత్రీకరించి ఘటనాస్థలాన్ని మార్చాడు. అనంతరం మృతురాలి బంగారు ఆభరణాలు, సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులు దాచిపెట్టి మామడ పోలీస్‌స్టేషన్‌లో తన భార్య మిస్సింగైనట్లు ఫిర్యాదు చేశాడు.

సీసీ ఫుటేజీ, టెక్నాలజీ ఆధారంగా..

ఈ కేసు ఛేదనలో సీసీ కెమెరా ఫుటేజీ, సాంకేతిక ఆధారాలు, శాసీ్త్రయ దర్యాప్తు కీలక పాత్ర పోషించినట్లు డీఎస్పీ తెలిపారు. నిందితుడు అరుణ్‌తో పా టు అతని తల్లిదండ్రులు శ్రీనివాస్‌, అదెల్లను అదుపులోకి తీసుకుని, వారి నుంచి సుమారు ఐదు తు లాల బంగారు ఆభరణాలు, బైక్‌, సెల్‌ఫోన్‌, ఇతర వస్తువులు స్వాధీనం చేసుకుని అరెస్ట్‌ చేసి రిమాండ్‌కు తరలించినట్లు పేర్కొన్నారు. స్వాధీనం చేసిన ఆస్తుల విలువ సుమారు రూ.8లక్షలు ఉంటుందని తెలిపారు. ఈ కేసును వేగంగా ఛేదించిన నిర్మల్‌ డీ ఎస్పీ శ్రీనివాస్‌, ఖానాపూర్‌ సీఐ అజయ్‌, ఎస్సై రా హుల్‌ గైక్వాడ్‌, దర్యాప్తులో పాల్గొన్న పోలీస్‌ సిబ్బందిని ఎస్పీ జానకీ షర్మిల అభినందించారు. నిందితులపై బీఎన్‌ఎస్‌ చట్టంలోని సంబంధిత సెక్షన్లు, డౌరీ ప్రొహిబిషన్‌ యాక్ట్‌ కింద కేసులు నమోదు చేసి ద ర్యాప్తు కొనసాగిస్తున్నట్లు పోలీసులు వెల్లడించారు.

Advertisement
 
Advertisement
Advertisement