బెల్లంపల్లి: గంజాయి కేసులో నిందితులుగా ఉన్న నలుగురు యువకులను అరెస్టు చేసి డీఅడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు వన్‌టౌన్ ఎస్‌హెచ్‌వో కె.శ్రీనివాసరావు తెలిపారు. గతంలో గంజాయి కేసుల్లో నిందితులుగా ఉన్న ఆరుగురు యువకులకు పోలీస్‌స్టేషన్‌లో కౌన్సెలింగ్ ఇచ్చారు. సదరు యువకులపై అనుమానం వచ్చి మంగళవారం మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రిలో నార్కోటిక్ పరీక్షలు చేయించగా ఎస్.కే జమీర్ (బెల్లంపల్లి బస్తీ), ఆర్‌ఎండీ తాజ్‌బాబా, ఎస్.కే.ఖలీం (వెజిటేబుల్ మార్కెట్ ఏరియా), తోట మణిదీప్ (65 డీప్ ఏరియా)కు పాజిటివ్ రిపోర్టు వచ్చింది. సదరు యువకులపై కేసు నమోదు చేసి కోర్టులో హాజరు పరిచారు. కోర్టు ఆదేశాల మేరకు నిందితులను మంచిర్యాల ప్రభుత్వ ఆస్పత్రి డిఅడిక్షన్ సెంటర్‌కు తరలించినట్లు ఎస్‌హెచ్‌వో తెలిపారు.


