మూఢ నమ్మకాల వెనుక ఉన్న నిజాలను సైన్స్ ద్వారా తెలుసుకున్నా. వాటిని నమ్మకుండా శాసీ్త్రయ దృక్పధంతో ఆలోచించడం అవసరమని తెలుసుకున్నా. బ్యాటరీ తీగను ఉపయోగించి మాతో మోటర్ తయారు చేయించారు. అది తిరిగినప్పుడు మా ఫీలింగ్ మాటల్లో చెప్పలేం. బల్పులను శ్రేణిలో సమాంతరంగా ఎలా కలుపుతారో నేర్పించారు.– కె.స్రవంతి,
జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్, మంచిర్యాల
సైన్స్ సూత్రం తెలుసుకున్నా
ఫన్ ఆక్టివిటీస్‌తో పాటు రసాయన చర్యల రకాలు వివరించారు. ఆమ్లాలు, క్షారాలు ఏవిధంగా గుర్తించాలో నేర్చుకున్నా. సాంద్రత అనేది వస్తువు నీటిలో మునగటానికి కారణమని గుర్తించా. ఫన్ ఆక్టివిటీస్ చేస్తున్నప్పుడు ఆనందం వేసింది. స్వాములు, బాబాలు చేసే మ్యాజిక్ వెనుక ఉన్న సైన్స్ సూత్రం తెలుసుకున్నా. అవి మంత్రాలు, తంత్రాలు కాదని, వాటిని నమ్మకూడదని సైన్స్ శిబిరం ద్వారా తెలుసుకున్నా.
–మణికార్తీక, జెడ్పీహెచ్‌ఎస్ గర్ల్స్, మంచిర్యాల


