● కొనసాగుతున్న వేసవి శిబిరాలు ● ఉచిత శిక్షణ ఇస్తున్న మంచిర్యాల స్టార్ బ్యాడ్మింటన్ అసోసియేషన్ ● మెళకువలు నేర్పిస్తున్న కోచ్‌లు
బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతున్న విద్యార్థులు
మంచిర్యాలటౌన్: వేసవి సెలవులను సద్వినియో గం చేసుకునేందుకు విద్యార్థులు వారికి ఆసక్తి ఉన్న క్రీడల్లో శిక్షణ పొందుతున్నారు. జిల్లా యువజన క్రీ డల శాఖ ఆధ్వర్యంలో వేసవి క్రీడా శిక్షణ శిబిరాలు ఏర్పాటు చేసి నామమాత్రపు ఫీజు వసూలు చేసి శిక్షణ ఇస్తున్నారు. బ్యాడ్మింటన్‌కు ఒక్కరికి రూ.500 వ రకు తీసుకుంటుండగా విద్యార్థులు ఆసక్తి చూపించ డం లేదు. దీంతో స్టార్ మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ విద్యార్థులకు మంచిర్యాల క్లబ్‌లో ఉచిత శిక్షణ ఇచ్చేందుకు ముందుకువచ్చింది. ఇందుకు మంచిర్యాల క్లబ్ సహకారం అందిస్తుండగా, వీవీ బ్యాడ్మింటన్ అకాడమీ కోచ్ వివేక్ ఉద యం 8.30నుంచి 10వరకు, సాయంత్రం 5.30నుంచి 7గంటల వరకు ఉచితంగా శిక్షణ ఇస్తున్నారు.
బాడ్మింటన్‌కు పెరిగిన ఆదరణ
జిల్లాలో ఎక్కువ మంది ఆసక్తి చూపిస్తున్న ఆటలో బ్యాడ్మింటన్ ఒకటి. ఇప్పటికే పలుసార్లు మంచిర్యాలలో రాష్ట్రస్థాయి పోటీలు నిర్వహించారు. ఏటా వేసవిలో ఉచిత శిక్షణ శిబిరాలను బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఏర్పాటు చేస్తున్నారు. కొత్తవారిని మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. దీంతో పలువురు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లోనూ రాణిస్తున్నారు. సీఎం కప్ పోటీల్లోనూ పలువురు జిల్లా క్రీడాకారులు రాష్ట్రస్థాయిలో ప్రతిభ కనబర్చారు. ముగ్గురు పతకాలు కూడా సాధించారు.


