దండేపల్లి: మొక్కజొన్న కొనుగోలు కేంద్రాల్లో బార్దాన్ కొరత తీర్చాలని బీజేపీ రాష్ట్ర ఉపాధ్యక్షుడు వెరబెల్లి రఘునాథ్ డిమాండ్ చేశారు. బుధవారం నాగసముద్రం, మాకులపేట గ్రా మాల్లో మొక్కజొన్న కొనుగోలు కేంద్రాలను సందర్శించారు. బార్దన్ లేక ఇబ్బంది పడుతున్నామని పలువురు రైతులు వాపోయారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ సరిపడా బార్దన్ లేక పోవడంతో కొనుగోళ్లు ఆలస్యం అవుతున్నాయన్నారు. కార్యక్రమంలో నాగసముద్రం సర్పంచ్ సుగుణ, ఉప సర్పంచ్ రమణయ్య, బీజేపీ మండల అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు రవిగౌడ్, సంతోష్ పాల్గొన్నారు.


