ఇంతకు ముందు వేసవి సెలవులు వచ్చాయంటే చుట్టాల ఇంటికి వెళ్లి అక్కడే ఉండేవాళ్లం. దీంతో సమయం వృథా అయిపోయేది. కానీ ఈసారి మాత్రం సెలవులను వృథా చేయకుండా సింగరేణి ఏర్పాటు చేసిన క్రీడా శిక్షణ శిబిరంలో చేరి అథ్లెటిక్స్ నేర్చుకోవడం సంతోషంగా అనిపిస్తోంది.
– హన్నత్, 9వ తరగతి విద్యార్థిని
క్రీడలతో ఉపయోగం
చదువుతో పాటు క్రీడల్లోనూ రాణిస్తే ఎన్నో ఉపయోగాలు ఉన్నాయి. దీనిని దృష్టిలో పెట్టుకుని సింగరేణి ఏర్పాటు చేసిన వేసవి క్రీడా శిక్షణ శిబిరంలో చేరి అథ్లెటిక్స్‌లో శిక్షణ తీసుకుంటున్నా. అథ్లెటిక్స్ అంటే నాకు చాలా ఇష్టం. ప్రతీరోజు ఉదయం, సాయంత్రం గ్రౌండ్‌కు వచ్చి సాధన చేస్తున్నా. – పి.శ్రావ్య, ఇంటర్ విద్యార్థిని


