మంచిర్యాలఅర్బన్: జిల్లాలో ఇంటర్ అడ్వాన్స్‌డ్ పరీక్షలు బుధవారం ప్రారంభమయ్యాయి. జిల్లా వ్యాప్తంగా 14 పరీక్ష కేంద్రాలు ఏర్పాటు చేశారు. ప్రథమ సంవత్సరం 1,501 మంది విద్యార్థులకు గానూ 1,417 మంది హాజరుకాగా 84 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 1,377 మందికి గానూ 1302 మంది హాజరుకాగా 75 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 124 మందికి గానూ 115 మంది హాజరుకాగా 9 మంది గైర్హాజరయ్యారు. ద్వితీయ సంవత్సరం 470 మంది విద్యార్థులకుగానూ 439 మంది హాజరుకాగా 31 మంది గైర్హాజరయ్యారు. జనరల్ విద్యార్థులు 449 మందికి గానూ 421 మంది హాజరుకాగా 28 మంది గైర్హాజరయ్యారు. వొకేషనల్ విద్యార్థులు 21 మందికి గానూ 18 మంది హాజరుకాగా ముగ్గురు గైర్హాజరయ్యారు. పరీక్ష కేంద్రాల వద్ద కట్టుదిట్టమైన ఏర్పాట్లు చేశారు. పరీక్ష కేంద్రాలను డీఐఈవో అంజయ్య తనిఖీ చేశారు.


