ముల్కలపేటలో ఒకరి హఠాన్మరణం | - | Sakshi
Sakshi News home page

ముల్కలపేటలో ఒకరి హఠాన్మరణం

May 15 2026 12:37 PM | Updated on May 15 2026 12:37 PM

వేమనపల్లి: మండలంలోని ముల్కలపేటలో ఒకరు హఠాన్మరణం చెందిన సంఘటన చోటు చేసుకుంది. నీల్వాయి ఎస్సై జగదీష్‌రెడ్డి తెలిపిన వివరాల మేరకు కుమురంభీం జిల్లా దహెగాం మండలం గిరివెల్లికి చెందిన రాకేష్‌ (29)కు ముల్కలపేటకు చెందిన మౌనికతో ఐదేళ్ల క్రితం వివాహమైంది. మూడురోజుల క్రితం గ్రామంలో జరిగి న ఓ వివాహ వేడుకలో పాల్గొనేందుకు అత్తగా రింటికి వచ్చాడు. బుధవారం సైతం ఎస్టీ కాలనీలో మరో వివాహ భరాత్‌లో పాల్గొన్నాడు. రాత్రి ఇంటికి వచ్చి పడుకున్నాడు. తెల్లవారు జామున కడుపులో నొప్పి రావడంతో 108లో చెన్నూర్‌ ఆస్పత్రికి తరలిస్తుండగా మార్గమధ్యలో మృతి చెందాడు. తన కుమారుడి అకాల మరణానికి కారణం తెలపాలని తండ్రి వెంకన్న నీల్వాయి పోలీసులకు ఫిర్యాదు చేయగా కేసు నమోదు చేసుకుని దర్యాప్తు చేస్తున్నట్లు ఎస్సై తెలిపారు. పోస్టుమార్టమ్‌ నివేదిక, విచారణ అనంతరం వివరాలు వెల్లడిస్తామన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement