ఆరోగ్యకరమైన భవిష్యత్‌ నిర్మించుకోవాలి | - | Sakshi
Sakshi News home page

ఆరోగ్యకరమైన భవిష్యత్‌ నిర్మించుకోవాలి

May 17 2026 7:08 AM | Updated on May 17 2026 7:08 AM

నస్పూర్‌: ప్రజలు ఆరోగ్యకరమైన భవిష్యత్‌ నిర్మించుకోవాలని నగర మేయర్‌ ధర్ని మధుకర్‌ అన్నారు. శ్రీరాంపూర్‌లోని అరుణక్కనగర్‌లో శనివారం జాతీయ డెంగీ దినోత్సవం సందర్భంగా జిల్లా వైద్య, ఆరోగ్య శాఖ ఆధ్వర్యంలో అవగాహన ర్యాలీ నిర్వహించారు. ఈ సందర్భంగా మేయర్‌ మధుకర్‌ మాట్లాడుతూ జిల్లాలో డెంగీ జ్వరాలు ప్రబలకుండా జాగ్రత్తలు తీసుకోవాలని సూచించారు. పరిసరాలను పరిశుభ్రంగా ఉంచుకుందామని, డెంగీని నిర్మూలిద్దామని అన్నారు. ఇంటి పరిసరాల్లో నీరు నిలువకుండా జాగ్రత్తలు తీసుకోవాలని తెలిపారు. ఈ కార్యక్రమంలో జిల్లా వైద్యాధికారి అనిత, డిప్యూటీ మేయర్‌ సల్ల రమ్య, జిల్లా మాస్‌ మీడియా అధికారి బుక్క వెంకటేశ్వర్‌, ప్రోగ్రామ్‌ అధికారులు డాక్టర్‌ సుధాకర్‌నాయక్‌, అల్లాడి శ్రీనివాస్‌, కార్పొరేటర్‌ రవీందర్‌, తదితరులు పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement