జాతీయస్థాయిలో రాణించేందుకే.. | - | Sakshi
Sakshi News home page

జాతీయస్థాయిలో రాణించేందుకే..

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

ఈ ఏడాది నేను అండర్‌–19 ఎస్జీఎఫ్‌ పోటీల్లో రాష్ట్ర జట్టు తరఫున ఢిల్లీలో జరిగిన జాతీయస్థాయి పోటీల్లో పాల్గొన్నాను. హైదరాబాద్‌లో చదువుతూ బ్యాడ్మింటన్‌లో శిక్షణ పొందుతున్నాను. వేసవి సెలవుల్లో మంచిర్యాలకు వచ్చి శిక్షణ తీసుకుంటున్నాను. అమ్మానాన్న, బ్యాడ్మింటన్‌ అసోసియేషన్‌ సహకారం మరువలేనిది. – గుండ అనన్య, పాతమంచిర్యాల

ఏటా శిక్షణకు హాజరవుతా

ఏటా వేసవిలో నిర్వహించే బ్యాడ్మింటన్‌ శిక్షణకు తప్పనిసరిగా హాజరవుతున్నాను. చదువుతోపాటు ఆటల్లో రాణించేందుకు వేసవి సెలవులను సద్వినియోగం చేసుకుంటున్నాను. ఇప్పటివరకు ఆరుసార్లు రాష్ట్రస్థాయిలో ఆడాను. జాతీయ స్థాయి ర్యాంకింగ్‌ టోర్నమెంట్‌లోనూ పాల్గొన్నాను. వేసవి సెలవుల్లో శిక్షణ కొనసాగిస్తున్నాను.

– ఆరాధ్య, గౌతమీనగర్‌, మంచిర్యాల

రాష్ట్ర స్థాయి పోటీలకు సిద్ధం చేశాం

క్రీడల్లో రాణించాలని అనుకునే వారికి మేము ఉచితంగా బ్యాడ్మింటన్‌ శిక్షణ ఇస్తున్నాం. ప్రతీరోజు శిక్షణ పొందితే రాష్ట్ర, జాతీయస్థాయిలో రాణించే అవకాశముంటుంది. వేసవి శిక్షణ అనంతరం కూడా బ్యాడ్మింటన్‌లో శిక్షణ కొనసాగిస్తే రాష్ట్ర, జాతీయ స్థాయి పోటీలకు వెళ్లేందుకు మంచి అవకాశం ఏర్పడుతుంది. బ్యాడ్మింటన్‌ శిక్షణ శిబిరానికి హాజరవుతున్నవారిలో నైపుణ్యం చూపిస్తున్న వారిని రాష్ట్రస్థాయి పోటీలకు సిద్ధం చేస్తాం.

– వివేక్‌ వర్ధన్‌,

బ్యాడ్మింటన్‌ కోచ్‌

Advertisement
 
Advertisement
Advertisement