కోటపల్లి: కొనుగోలు చేసిన ధాన్యం దిగుమతి ప్రక్రియ వేగవంతం చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ రాములు అన్నారు. ఆదివారం కోటపల్లి మండల కేంద్రంలోని ధాన్యం నిల్వ చేసే గోదాములతో పాటు శంకరాపూర్ కొనుగోలు కేంద్రాన్ని సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం వరి ధాన్యం కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసి నిబంధనల మేరకు ధాన్యాన్ని కొనుగోలు చేయడం జరుగుతుందన్నారు. గోదాములకు తరలించిన ధాన్యాన్ని వేగవంతంగా దిగుమతి చేసుకోవాలని, అవసరమైతే హమాలీల సంఖ్య పెంచుకోవాలన్నారు. అనంతరం డీసీఎంఎస్ కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించి తేమశాతం చూసుకుని తాలు, తప్ప ఎలాంటి మట్టిగడ్డలు లేని నాణ్యమైన ధాన్యాన్ని కొనుగోలు కేంద్రాలకు తీసుకురావాలని రైతులకు సూచించారు. కార్యక్రమంలో తహసీల్దార్ రాఘవేందర్‌రావు, సీఐ కృష్ణ, తదితరులు పాల్గొన్నారు.


