చెన్నూర్: చెన్నూర్ మార్కెట్ యార్డులో ధాన్యం కొనుగోలు చేయాలని మూడు రోజులుగా రైతులు పడిగాపులు కాస్తున్నా మంత్రి గడ్డం వివేక్ వెంకటస్వామి, పెద్దపల్లి ఎంపీ వంశీకృష్ణ పట్టించుకోవడంలేదని జెడ్పీ మాజీ వైస్‌చైర్మన్ మూల రాజిరెడ్డి ఆరోపించారు. ప్రభుత్వ తీరును నిరసిస్తూ ఆదివారం స్థానిక మార్కెట్ యార్డులో రైతులతో కలిసి నిరసన తెలిపారు. ఈ సందర్భంగా ఏర్పాటు చేసిన సమావేశంలో ఆయన మాట్లాడుతూ రైతులు డీసీఎం సెంటర్ల వద్ద పక్షం రోజులుగా ఇబ్బందులు పడుతుంటే మంత్రి, ఎంపీ కొనుగోలు కేంద్రాలను సందర్శించిన పాపాన పోలేదన్నారు. రైతులు సొంత ఖర్చులతో ట్రాక్టర్ల ద్వారా ధాన్యం తీసుకువచ్చినా కోనుగోలు చేయడం లేదన్నారు. హమాలీ ఖర్చులు సైతం రైతులే భరించాల్సిన దుస్థితి నెలకొందన్నారు. ప్రెస్‌మీట్‌ను అడ్డుకునేందు సీఐ బన్సీలాల్ ప్రయత్నించగా బీఆర్‌ఎస్ శ్రేణులు, పోలీసుల మధ్య వాగ్వాదం జరిగింది. సమావేశంలో బీఆర్‌ఎస్ మండల అధ్యక్షుడు మల్లెల దామోదర్‌రెడ్డి, కౌన్సిలర్ కొప్పుల ప్రభాకర్, మాజీ కౌన్సిలర్లు రెవెల్లి మహేశ్, అనిల్, తుమ్మ రమేశ్, జోడు శంకర్, నాయకులు మానిశెట్టి శ్రీనివాస్, రుద్రంభట్ల సంతోశ్, భారతి, అయిత సురేశ్‌రెడ్డి, నాయబ్, తదితరులు పాల్గొన్నారు.


