మొక్కజొన్న పంట దగ్ధం | - | Sakshi
Sakshi News home page

మొక్కజొన్న పంట దగ్ధం

May 16 2026 1:21 AM | Updated on May 16 2026 1:21 AM

సారంగపూర్‌: మండలంలోని కంకెట గ్రామానికి చెందిన రైతు బండారి గంగాధర్‌ రెండెకరా ల మొక్కజొన్న పంట అగ్నికి ఆహూతైంది. బా ధితుడు, స్థానికులు తెలిపిన వివరాల ప్రకారం.. గంగాధర్‌ తన రెండెకరాల మొక్కజొన్న పంటను వారం క్రితం కోత కోయించి కుప్పలుగా వేశాడు. నూర్పిడి చేసేందుకు హార్వెస్టర్‌ దొరకలేదు. ఈక్రమంలో శుక్రవారం ప్రమాదవశాత్తు నిప్పంటుకోవడంతో దాదాపు కుప్పలన్నీ కాలి బూడిదయ్యాయి. స్థానిక సర్పంచ్‌ సాహెబ్‌రా వు ఘటనా స్థలానికి చేరుకుని తహసీల్దార్‌ విజ య్‌కాంత్‌రావుకు విషయం తెలిపారు. ఆర్‌ఐ న ర్సయ్య పంటనష్టం అంచనా వేశారు. దాదాపు రూ.2లక్షల నష్టం జరిగినట్లు నిర్ధారించారు.

Advertisement
 
Advertisement
Advertisement