మంచిర్యాలఅగ్రికల్చర్: బ్యాంకు ద్వారా పింఛన్లు పొందుతున్న లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణ కచ్చితత్వంతో చేయాలని జిల్లా అదనపు కలెక్టర్ పి.చంద్రయ్య అన్నారు. శుక్రవారం కలెక్టరేట్‌లో జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి కిషన్, అదనపు జిల్లా గ్రామీణాభివృద్ధి అధికారి అంజయ్యతో కలిసి బెల్లంపల్లి, మందమర్రి మంచిర్యాల పురపాలక సంఘాల సిబ్బందికి చేయూత పథకం లబ్ధిదారుల జీవన ప్రామాణీకరణపై శిక్షణ కార్యక్రమం నిర్వహించారు. ఈ సందర్భంగా జిల్లా అదనపు కలెక్టర్ మాట్లాడుతూ జిల్లాలోని బెల్లంపల్లి, మందమర్రి, మంచిర్యాల పురపాలక సంఘాల పరిధిలో 27,854 మంది పింఛన్‌దారులు లబ్ధి పొందుతున్నారని, వారి జీవన ప్రామాణీకరణను రాబోయే 15 రోజుల్లో పూర్తి చేయాలని ఆదేశించారు. అనంతరం జీవన ప్రామాణీకరణ ప్రక్రియపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ద్వారా వివరించారు. ఈ కార్యక్రమంలో డీపీఎం అన్నాజీ, ఏపీఎం రాజ్‌కుమార్, పురపాలక సంఘ కమిషనర్లు, అధికారులు పాల్గొన్నారు.


