ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణకు క్రమం తప్పకుండా హాజరవుతున్నాను. ఇక్కడ మంచి శిక్షణ ఇస్తున్నారు. రాష్ట్ర, జాతీయస్థాయి పోటీల్లో పాల్గొనేలా అన్ని రకాల మెళకువలు నేర్పిస్తున్నారు. మంచి క్రీడాకారులుగా తీర్చిదిద్దుతున్నారు. సెలవుల అనంతరం సమయం దొరికినప్పుడల్లా బ్యాడ్మింటన్‌లో శిక్షణ తీసుకుని రాష్ట్రస్థాయి పోటీల్లో రాణిస్తాను.
– సిద్దు, మంచిర్యాల
ఉచిత శిక్షణతో ప్రోత్సహిస్తున్నాం
జిల్లాలో క్రీడాకారులుగా రాణించేందుకు పలువురికి ఆసక్తి ఉన్నా సరైన శిక్షణ లేక వెనుకబడి పోతున్నారు. దీంతో మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ తరఫున ఏటా వేసవిలో ఉచిత శిక్షణ ఇస్తున్నాం. బ్యాడ్మింటన్‌లో జిల్లాకు చెందిన ఎంతో మంది క్రీడాకారులు రాష్ట్ర, జాతీయ స్థాయిల్లో రాణిస్తున్నారు. వేసవి సెలవుల నేపథ్యంలో ఆసక్తి ఉన్నవారికి మేము ఇస్తున్న ఉచిత బ్యాడ్మింటన్ శిక్షణ ఎంతగానో ఉపయోగపడుతుంది.
– పుల్లూరి సుధాకర్, మంచిర్యాల జిల్లా బ్యాడ్మింటన్ అసోసియేషన్ జనరల్ సెక్రటరీ


