రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు | - | Sakshi
Sakshi News home page

రైతులకు ఇబ్బంది లేకుండా కొనుగోళ్లు

May 18 2026 10:01 AM | Updated on May 18 2026 10:01 AM

చెన్నూర్‌: నియోజకవర్గంలో రైతులకు ఇబ్బందులు లేకుండా ధాన్యం కొనుగోళ్లు జరుగుతున్నాయని కాంగ్రెస్‌ నాయకులు అన్నారు. స్థానిక మార్కెట్‌ గోదాం వద్ద ఆదివారం ఏర్పాటు చేసిన విలేకరుల సమావేశంలో చెన్నూర్‌, కోటపల్లి మండలాల కాంగ్రెస్‌ నాయకులు మాట్లాడారు. మంత్రి, ఎంపీలు రైతులను పట్టించుకోవడం లేదని కొందరు బీఆర్‌ఎస్‌ నాయకులు అసత్యపు ప్రచారం చేస్తున్నారని, ఇలాంటివి మానుకోవాలన్నారు. మంత్రి వివేక్‌ వెంకటస్వామి ఎప్పటికప్పుడు అధికారులతో మాట్లా డి గోదాములను అద్దెకు తీసుకొని ధాన్యాన్ని తరలిస్తున్నారన్నారు. లారీలు అన్‌లోడ్‌ కావడం ఆలస్యమవుతుంటే కొనుగోళ్లు జరగడం లేదని ఆరోపించడం తగదన్నారు. బీఆర్‌ఎస్‌ హయాంలో ఎలాంటి ఇబ్బందులు పడ్డారో రైతులకు తెలుసన్నారు. మంత్రిపై అబద్దపు ప్రచారాలు చేస్తే సహించేది లేదని హెచ్చరించారు. అసత్యపు ఆరోపణలు చేస్తున్న బీఆర్‌ఎస్‌ నాయకులపై పోలీస్‌స్టేషన్‌లో ఫిర్యాదు చేసినట్లు తెలిపారు. మార్కెట్‌ కమిటీ చైర్మన్‌ మహేశ్‌ప్రసాద్‌, మాజీ జెడ్పీటీసీ కరుణసాగర్‌రావు, నాయకులు పెద్దింటి శ్రీనివాస్‌, కౌన్సిలర్లు అంబాటి శంకర్‌, సుశీల్‌కుమార్‌, చెన్నూరి రాజేశ్‌, పాతర్ల నాగరాజు, బాపాగౌడ్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement