వేమనపల్లి: వరి ధాన్యం గోదాంలకు తరలించేలా చర్యలు తీసుకుంటున్నామని బెల్లంపల్లి సబ్ కలెక్టర్ మనోజ్ కుమార్ అన్నారు. ఆదివారం మండల కేంద్రంలోని మార్కెట్ కమిటీ గోదాంలో వరి ధాన్యం నిల్వ ఉంచేందుకు కావాల్సిన ఏర్పాట్లను పరిశీలించారు. చెన్నూర్, ఇతర మండలాల నుంచి పెద్దఎత్తున ధాన్యం గోదాంకు తరలిస్తున్నామన్నారు. అన్‌లోడింగ్‌కు హమాలీలు సహకరించాలని, క్రమపద్ధతిలో ధాన్యం అన్‌లోడ్ చేయాలన్నారు. నీల్వాయి మక్కల కొనుగోలు కేంద్రం పరిశీలించి నిల్వలకు సరిపడా లారీలు పంపిస్తామన్నారు. తీగల్‌పహాడ్ గోదాంకు మక్కలను తరలిస్తున్నట్లు తెలిపారు. ఆయన వెంట డీటీ సాయికృష్ణ, ఆర్‌ఐ ఖాలిక్, లారీ కాంట్రాక్టర్లు రిషిక్‌రెడ్డి, అధికారులు పాల్గొన్నారు.


