ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి | - | Sakshi
Sakshi News home page

ఫిర్యాదులు త్వరగా పరిష్కరించాలి

May 12 2026 12:08 AM | Updated on May 12 2026 12:08 AM

● కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ ● కనీస వేతనం రూ.20వేలు, హెచ్‌ఆర్‌ పాలసీ అమలు చేసి ఉద్యోగ భద్రత కల్పించాలని, అర్హులైన వీవోఏలను సీసీలుగా ప్రమోట్‌ చేయాలని ఐకేపీ వీవోఏలు వినతిపత్రం అందజేశారు. ● 11 ఎకరాల భూమి, ఇల్లు పట్టా చేసి చేసుకుని మనవడు ఇంటి నుంచి వెళ్లగొట్టాడని దండేపల్లి మండలం రాజంపేటకు చెందిన కారుకూరి మల్లయ్య, మల్లవ్వ ఫిర్యాదు చేశారు. ● కాసిపేట మండలం కోమటిచేను గ్రామంలో గంజాయిని నిర్మూలించాలని, యువకులు మత్తులో వికృత చేష్టలు, దాడులకు పాల్పడుతున్నారని గ్రామస్తుడు దుర్గం స్వామి కోరారు. ● అటవీ అధికారుల వేధింపులు ఆపాలని కోటపల్లి మండలం రాజరాం ఎస్సీ, ఎస్టీ రైతులు, రోడ్డు వేయాలని కాసిపేటకు చెందిన దుర్గం నవీన్‌ కోరారు.

మంచిర్యాలఅగ్రికల్చర్‌: ప్రజావాణి కార్యక్రమంలో అందిన ఫిర్యాదులను క్షేత్రస్థాయిలో పరిశీలించి త్వరగా పరిష్కరించాలని కలెక్టర్‌ కుమార్‌ దీపక్‌ అన్నారు. సోమవారం కలెక్టరేట్‌లో జిల్లా అదనపు కలెక్టర్లు పి.చంద్రయ్య, వి.రాములుతో కలిసి ప్రజల నుంచి అర్జీలు స్వీకరించారు. భూసమస్యలు పరిష్కరించాలని, ఇందిరమ్మ ఇళ్లు, పంచాయతీ పనుల బిల్లులు ఇప్పించాలని, పింఛన్లు మంజూరు చేయాలని దరఖాస్తులు అందజేశారు. అధికారులు సమన్వయంతో దరఖాస్తులు పరిష్కరించి చర్యలు తీసుకోవాలని కలెక్టర్‌ తెలిపారు.

బస్తాకు మూడు కిలోల కోత

జైపూర్‌ మండలంలో ని ఐకేపీ, పీఏసీఎస్‌ ధాన్యం కొనుగోలు కేంద్రాల్లో బస్తా కు మూడు కిలోల కోత విధిస్తూ తూకం వేస్తున్నా రు. దీంతో క్వింటాల్‌కు 8 కిలోల వరకు నష్టపోతున్నాం. నిబంధనలకు విరుద్ధంగా కోతలు పెడుతూ రైతులను ముంచుతున్న వారిపై చర్యలు తీసుకుని న్యాయం చేయాలి.

– రైతులు, గ్రామం: కిష్టంపేట, మం: జైపూర్‌

Advertisement
 
Advertisement
Advertisement