గోల్‌ షాట్‌బాల్‌ జాతీయ అధ్యక్షుడిగా రవికుమార్‌ | - | Sakshi
Sakshi News home page

గోల్‌ షాట్‌బాల్‌ జాతీయ అధ్యక్షుడిగా రవికుమార్‌

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

ఆదిలాబాద్‌రూరల్‌: గోల్‌ షాట్‌ బాల్‌ అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడిగా సాయిని రవికుమార్‌ నియమితులయ్యారు. బుధవారం మండలంలోని చాందా (టి) శివారు ప్రాంతంలో గల ఓ ప్రైవేట్‌ పాఠశాలలో జరిగిన అసోసియేషన్‌ జనరల్‌ బాడీ సమావేశంలో నూతన కార్యవర్గాన్ని ప్రకటించారు. అసోసియేషన్‌ జాతీయ అధ్యక్షుడిగా సాయిని రవికుమార్‌, ప్రధాన కార్యదర్శిగా రాజేంద్రప్రసాద్‌, కోశాధికారిగా రామ్‌ పర్వేశ్‌ కుమార్‌, సీనియర్‌ ఉపాధ్యక్షుడిగా సుధాకర్‌ రావు, ఉపాధ్యక్షుడిగా యోగేష్‌ పాటిల్‌, జాయింట్‌ సెక్రటరీగా కరుణాకరన్‌, సెకండ్‌ జాయింట్‌ సెక్రటరీగా దేవిప్రియను ఎన్నుకున్నారు. నూతన కార్యవర్గ సభ్యులను అసోసియేషన్‌ ప్రతినిధులు శాలువాలతో సత్కరించారు.

Advertisement
 
Advertisement
Advertisement