రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ | - | Sakshi
Sakshi News home page

రాష్ట్రస్థాయి పోటీల్లో ప్రతిభ

May 14 2026 6:27 AM | Updated on May 14 2026 6:27 AM

తాండూర్‌: రంగారెడ్డి జిల్లాలో ఈ నెల 9 నుంచి నిర్వహించిన రాష్ట్రస్థాయి కిక్‌ బాక్సింగ్‌ పోటీల్లో జిల్లా విద్యార్థులు ప్రతిభ చాటారు. ఆవుల అభిషేక్‌ 2 గోల్డ్‌ మెడల్‌, సిల్వర్‌ మెడల్‌, లబాన్‌ నర్జరే గోల్డ్‌ మెడల్‌, కుబిడె పుష్పలత, రంగు సోహనిశ్రీ సిల్వర్‌ మెడల్‌, వినూత్న, సంయుక్తచారి, శ్రీవాస్తవ, శ్రీరిశ్వాన్‌ కాంస్య పతకాలు సాధించినట్లు అసోసియేషన్‌ జిల్లా జనరల్‌ సెక్రెటరీ మారుపాక శ్రీలత తెలిపారు. విజేతలను తెలంగాణ కిక్‌ బాక్సింగ్‌ అసోసియేషన్‌ అధ్యక్షుడు రామాంజనేయులు, ప్రధాన కార్యదర్శి మహిపాల్‌ అభినందించారు.

Advertisement
 
Advertisement
Advertisement