శ్రీరాంపూర్: సింగరేణి కార్మికుల హక్కులు సాధించిన చరిత్ర టీబీజీకేఎస్‌కు మాత్రమే ఉందని ఆ యూనియన్ కేంద్ర ప్రధాన కార్యదర్శి కేతిరెడ్డి సు రేందర్ రెడ్డి అన్నారు. సోమవారం శ్రీరాంపూర్ సీ హెచ్‌పీలో నిర్వహించిన బాయిబాట కార్యక్రమాని కి ఆయన ముఖ్యఅతిథిగా హాజరై మాట్లాడారు. సింగరేణిలో పోయిన డిపెండెంట్ ఉద్యోగాలను తి రిగి ఇప్పించామన్నారు. క్వార్టర్లకు ఉచిత విద్యుత్, ఏసీ సౌకర్యం, ఇంటి నిర్మాణానికి వడ్డీలేని రుణం, తదితర హక్కులు సాధించామన్నారు. గత గుర్తింపు ఎన్నికల్లో కార్మికులకు అనేక హామీలు ఇచ్చి గెలిచిన సంఘాలు నేడు అమలు చేయకుండా మోసం చేస్తున్నాయన్నారు. ఈ సందర్భంగా సీహెచ్‌పీకి చెందిన శ్రీనివాస్, కిరణ్, నూట శ్రీనివాస్, రాజ్‌కుమార్, ఆవునూరు శ్రీనివాస్, కుమ్మరి రాయలింగుతో పాటు పలువురు ఉద్యోగులు టీబీజీకేఎస్‌లో చేరగా వారికి కండువా కప్పి స్వాగతించారు. ఈ కార్యక్రమంలో ఆ యూనియన్ బ్రాంచ్ ఉపాధ్యక్షుడు బండి రమేష్, పిట్ సెక్రెటరీ అందె రాజ్‌కుమార్, నాయకులు బుస్స రమేశ్, శ్రీనివాస చారి, కాసారపు లక్ష్మణ్, సంపత్, నరేష్, రమణారెడ్డి, అమరేందర్, తదితరులు పాల్గొన్నారు.


