20న మెడికల్‌ షాపులు బంద్‌ | - | Sakshi
Sakshi News home page

20న మెడికల్‌ షాపులు బంద్‌

May 18 2026 10:07 AM | Updated on May 18 2026 10:07 AM

నస్పూర్‌: ఈ నెల 20న జిల్లాలోని అన్ని రిటైల్‌, హోల్‌సేల్‌ మెడికల్‌ షాపులు బంద్‌ చేస్తున్నట్లు జిల్లా కెమిస్ట్‌, డ్రగ్గిస్ట్‌ అసోసియేషన్‌ జిల్లా అధ్యక్షుడు మోటూరి చంద్రశేఖర్‌రావు, ప్రధాన కార్యదర్శి తొగరి సుధాకర్‌ తెలిపారు. నస్పూర్‌ శ్రీరాంపూర్‌ ప్రెస్‌క్లబ్‌లో ఆదివారం బంద్‌కు సంబంధించిన పోస్టర్‌ ఆవిష్కరించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ ఆన్‌లైన్‌లో మందుల విక్రయాలు నిలిపివేయాలని, కార్పొరేట్‌ సంస్థలకు భారీ డిస్కౌంట్లు ఇవ్వవద్దని డిమాండ్‌ చేస్తూ చేపట్టిన బంద్‌కు ప్రజలు సహకరించాలని విజ్ఞప్తి చేశారు. మందులు అత్యవసరమైన వారు 98662 23544, 92473 93239, 98497 05767 నంబర్లలో సంప్రదించాలని సూచించారు. ఈ కార్యక్రమంలో ట్రెజ రర్‌ గుడెల్లి రాజేంద్రప్రసాద్‌, కార్యవర్గ సభ్యులు విష్ణువర్ధన్‌రెడ్డి, ఏ.సమ్మయ్య, ఎస్‌.రమణారెడ్డి, జి.రవీందర్‌, టి.వెంకటేశ్‌, తిరుపతి, రమేశ్‌, కుమార్‌, రాజ్‌కుమార్‌ పాల్గొన్నారు.

Advertisement
 
Advertisement
Advertisement