Minor Girl Incident
-
‘ఏడేళ్ల చిన్నారిని డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తుంది?’
తాడేపల్లి : ఏపీలో మహిళలు, చిన్నారులపై అఘాయిత్యాలు పెరిగిపోతున్నా ప్రభుత్వానికి కనబడుటం లేదా అని ప్రశ్నించారు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే టి. చంద్రశేఖర్. ఈ అఘాయిత్యాల గురించి అసెంబ్లీలో అడిగితే హోంమంత్రి సమాధానం చెప్పలేదని, ఈ ప్రశ్న ఉత్పన్నం కాదంటూ సమాధానం చెప్పారన్నారు. మరి మదనపల్లెలో ఏడేళ్ల చిన్నారిని హతమార్చి డ్రమ్‌లో కుక్కేస్తే ప్రభుత్వం ఏం చేస్తందని నిలదీశారు. ఇది హోంమంత్రికి, రాష్ట్ర ప్రభుత్వానికి కనబడుటం లేదని మండిపడ్డారు. ఈరోజు(మంగళవారం, ఫిబ్రవరి 17వ తేదీ) తాడేపల్లి వైఎస్సార్సీపీ కేంద్ర కార్యాలయం నుంచి మాట్లాడిన చంద్రశేఖర్.. ‘ రాష్ట్రంలో రౌడీలు లేకుండా చేస్తానంటున్న చంద్రబాబు.. అసెంబ్లీలో తన పక్కనే కూర్చోపెట్టుకుంటున్నారు. బాలకృష్ణ మహిళలపై అనుచిత వ్యాఖ్యలు చేయగా, ఆయన అనుచరుడు మైనర్ బాలిక జీవితాన్ని నాశనం చేశాడు. ఇలాంటి వ్యక్తులను ఏం చేయాలి?, నేరస్తులంతా క్యాష్‌ను సూట్ కేసులో పెట్టి రాజేష్ ద్వారా లోకేష్‌కి పంపుతారు. దాంతో కేసులు లేకుండా పోతున్నాయి. చిన్నపిల్లలను చెరబడుతుందే చంద్రబాబు, హోంమంత్రి తమకేం పట్టనట్టు వ్యవహరిస్తున్నారు. కాసుల కోసం ఎంతకైనా తెగిస్తున్నారు. చివరికి కోటప్పకొండ దగ్గర కూడా పోలీసుల సమక్షంలో మద్యం విక్రయాలు చేశారు. వైఎస్సార్ సీపీ కార్యకర్తలు ప్రభ కడితే పోలీసులు లాఠీలతో కొట్టారు. కరెంటు కూడా వేయనీయకుండా అడ్డుకున్నారు. నియంత పోకడలు ఎల్లకాలం పని చేయవు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు చంద్రబాబు అసెంబ్లీకి రాకుండా జీతాలు తీసుకున్నారు. ఆ వివరాలు ఇవ్వమని అడిగితే స్పీకర్ నన్న బెదిరించారు. చంద్రబాబు హెరిటేజ్‌దే ఇందాపూర్ డైరీ. ఊరుకొక మాన్‌ఫ్యాక్చరింగ్ యూనిట్లు పెట్టారు’ అంటూ విమర్శించారు. ఇదీ చదవండి: మదనపల్లిలో మైనర్ బాలిక హత్య కేసు.. ఉద్రిక్తత -
మదనపల్లిలో మైనర్ బాలిక హత్య కేసు.. ఉద్రిక్తత
అన్నమయ్య : మదనపల్లిలో అదృశ్యమైన ఓ మైనర్ బాలికను దారుణంగా హత్య చేయడంపై స్థానికంగా ఆందోళన కొనసాగుతోంది. కొన్ని గంటలుగా కదిరి- మదనపల్లి హైవే దిగ్బంధించి స్థానికులు ఆందోళన చేపట్టారు. కడప జిల్లా ఎస్పీ నచికేత్ విశ్వనాథ్, మదనపల్లి సబ్ కలెక్టర్ కళ్యాణి. ఆందోళనకారులతో మాట్లాడినప్పటికీ స్థానికులు మాత్రం నిందితుడ్ని ఉరి తీయాలనే డిమాండ్‌తో నిరసన చేపట్టారు. కాగా, మదనపల్లిలో అదృశ్యమైన బాలిక కేసు విషాదాంతమైంది. బాలికను హత్య చేసి డ్రమ్ములో దాచాడు నిందితుడు. మదనపల్లి పట్టణం, నీరుగట్టువారిపల్లిలోని కాట్లాటపల్లి రోడ్డులో కాపురం ఉంటున్న చేనేత కార్మికుడు గోపీనాథ్ కుమార్తె రిషిక ప్రియా(7)ను హత్య గావించబడింది. తొలుత బాలిక కన్పించకపోవడంపై మిస్సింగ్ కేసు నమోదు చేశారు. దీనిలో భాగంగా బాలిక ఆచూకీ తెలపాల్సిందిగా పత్రికా ప్రకటన ఇచ్చారు పోలీసులు. ఆపై జిల్లా ఎస్పీ ధీరజ్ కునుబిల్లి, డీఎస్పీ మహేంద్ర సూచనల మేరకు సీఐ మహమ్మద్ రఫీ, సిబ్బందితో విస్తృతంగా గాలింపు చర్యలు చేపట్టగా, ఆ బాలిక హత్యగావించబడినట్లు తేలింది. సీసీ కెమెరాల ఫుటేజ్ ఆధారంగా రిషిక ప్రియను ఓ వ్యక్తి దారుణంగా చంపి డ్రమ్ములో కుక్కినట్లు గుర్తించి, హత్య జరిగినట్లు నిర్ధారించారు. అనుమానితుడి ఇంటిని చుట్టిముట్టి..మదనపల్లెలో ఆందోళన కొనసాగుతోంది. అనుమానితుడి ఇంటిని స్థానిక గ్రామస్తులు చుట్టుముట్టారు. నిందితుడిని ఎన్కౌంటర్ చేయాలని డిమాంఢ్ చేస్తున్నారు. ఎస్పీతోపాటు పోలీసులు ఎంత సర్ది చెబుతున్న బాధితులు మాత్రం వినడం లేదు. ఈ నేపథ్యంలో ఇప్పటివరకు బాలిక శవాన్ని బయటకి తీయలేని పరిస్థితి నెలకొంది. మరోపక్క నిందితుని కఠినంగా శిక్షించాలంటూ అన్నమయ్య సర్కిల్లో కొనసాగుతున్న రాస్తారోకో కొనసాగుతోంది.పాప తల్లితో ఫోన్లో మాట్లాడి న్యాయం చేస్తామని హోంమంత్రి చెప్పారు. అనుమానితుడి ఇంటి చుట్టూ ప్రజలు ,హిజ్రాలు, ప్రజాసంఘాల నాయకులు భారీగా చుట్టుముట్టారు. కర్నూలు డీఐజీ సైతం ఘటనా స్థలికి బయల్దేరి వస్తున్నట్లు తెలుస్తోంది. > -
మూడేళ్ళుగా మైనర్ బాలికపై అత్యాచారం.. ఉపాధ్యాయుడిపై పోక్సో కేసు
-
ఒరేయ్ పిచ్చి కుక్క.. తుని 13 ఏళ్ల బాలిక ఘటనపై KA పాల్ స్టాంగ్ రియాక్షన్..
-
ఇంకా మిస్టరీగానే నంద్యాల ముచ్చుమర్రి కేసు!
సాక్షి, నంద్యాల: నంద్యాల జిల్లా పగిడ్యాల మండలం ముచ్చుమర్రిలో తొమిదేళ్ల మైనర్ బాలిక ఆచూకీపై మిస్టరీ వీడలేదు. చిన్నారి అదృశ్యమై ఆరో రోజులు గడుస్తున్నా ఈ కేసులో పురోగతి కనిపిచటం లేదు. ఒక్క బోటుతో గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి. బాలిక తల్లిదండ్రులను ఆలూరు వైఎస్సార్సీపీ ఎమ్మెల్యే విరూపాక్షి పరామర్శించారు. బాలిక అదృశ్యంపై అన్ని కోణాల్లో దర్యాప్తు చేపట్టాలని ఎమ్మెల్యే అన్నారు. వారం గడుస్తున్నా బాలిక ఆచూకీ లభించకపోవడమేంటని ఆయన ప్రశ్నించారు. ఇది ముమ్మాటికీ ప్రభుత్వ వైఫల్యమేనని అన్నారు. బాధిత కుటుంబానికి ప్రభుత్వం న్యాయం చేయలన్నారు. పోలీసుల తీరుపై బాధిత కుటుంబం, స్థానికులు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈ కేసు మిస్టరీగానే ఉంటుందా? లేక పోలీసులు ఛేదిస్తారా? అనే పలు అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. ఆరు రోజులు గడుస్తున్నా పాప ఆచూకీ లభించపోవటంతో ముచ్చుమర్రి ప్రజలు ఎన్నో అనుమానాలు వ్యక్తం చేస్తూ.. ఎదురు చూపులు చూస్తున్నారు. అభం శుభం తెలియని తొమిదేళ్ళ చిన్నారి అదృశ్యంపై ఆరు రోజులు గడుస్తున్నా ఆచూకీ తెలియకపోవడంపై సర్వత్ర విమర్శలకు దారి తీస్తున్నాయి. డీఐజీ స్థాయి అధికారి ఘటన స్థలానికి చేరుకుని సీను రికస్టక్షన్ చేసినా కేసులో ఎలాంటి పురోగతి లభించలేదు.చదవండి: రేప్ చేసి, చంపేసి.. కాలువలో పడేశారు! -
ఉజ్జయిని కేసులో వారిపై కూడా చట్టపరమైన చర్యలు: ఏఎస్పీ
భోపాల్: దేశవ్యాప్తంగా సంచలనం సృష్టించిన ఉజ్జయిని మైనర్ బాలిక రేప్ సంఘటనలో నిందితుడిని కనుగొనేందుకు పోలీసులు విపరీతంగా శ్రమించారని తెలిపారు ఉజ్జయిని అడిషనల్ సూపెరింటెండెంట్ ఆఫ్ పోలీస్ జయంత్ సింగ్ రాథోడ్. ఈ సందర్భగా సంఘటన జరిగిన తర్వాత బాధితురాలు అన్ని ఇళ్లు తిరుగుతూ సహాయం కోరినప్పుడు సాయం చేయడానికి నిరాకరించిన వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని ఆయన తెలిపారు. శభాష్ పోలీస్.. ఉజ్జయిని ఏఎస్పీ జయంత్ సింగ్ రాథోడ్ మాట్లాడుతూ ఈ సంఘటన జరిగినప్పుడు తామంతా రాష్ట్రపతి రాష్ట్రానికి వచ్చిన కార్యక్రమంలో బిజీగా ఉన్నామని వీడియో బయటకు రాగానే షాక్‌కు గురయ్యామన్నారు. విషయం తెలిసిన వెంటనే మొదట ఆసుపత్రికి వెళ్లి బాలికను పరామర్శించామని అనంతరం విచారణ చేపట్టి సుమారు 700 సీసీటీవీ ఫుటేజిలను పరిశీలించి భరత్ సోనీ అనే ఆటో డ్రైవర్‌ను నిందితుడిగా గుర్తించామన్నారు. దాదాపు 30-35 మంది పోలీసులు నిద్రాహారాలు మాని ఇన్వెస్టిగేషన్లో పాల్గొన్నారని వారందరికీ పేరుపేరునా అభినందనలు తెలియజేస్తున్నామన్నారు. బాధ్యతారాహిత్యం.. సంఘటన జరిగిన తర్వాత ఆమె మరో ఆటోలో కొంతదూరం ప్రయాణించిందని.. ఆ ఆటో డ్రైవర్ రాకేష్ మాలవ్య విషయం తెలిసి కూడా పోలీసులకు సమాచారం అందించకపోవడం వలన విషయం తెలిసేసరికి ఆలస్యమైందన్నారు. పోక్సో చట్టం ప్రకారం రాకేష్ చేసింది కూడా నేరమేనని అందుకే అతడిని కూడా అదుపులోకి తీసుకున్నామన్నారు. అత్యాచారం జరిగిన తర్వాత బాలిక ఒక్కో ఇల్లు తిరుగుతూ సాయమడిగినా ఎవ్వరూ స్పందించకపోవడంపై స్పందిస్తూ మానవతా కోణంలో వారు చేసింది తప్పేనని వారిపై కూడా చట్టపరమైన చర్యలు తీసుకుంటామని అన్నారు. మరణశిక్ష విధించండి.. ఈ కేసులో నిందితుడైన ఆటో డ్రైవర్ భరత్ సోనీ తండ్రి జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ తన కుమారుడు తప్పు చేసినట్లు నిరూపితమైతే మరణశిక్ష విధించామని అంతకంటే పెద్ద శిక్ష మరొకటి లేదు కాబట్టి అదే అమలు చేయాలన్నారు. ఈ కేసును ఛేదించిన ఉజ్జయిని మహాకాల్ ఎస్సై అజయ్ వర్మ వారి బంధువులకు అభ్యంతరం లేకపోతే బాలికను దత్తత తీసుకుంటానని ప్రకటించి పెద్దమనసు చాటుకున్నారు. ఇది కూడా చదవండి: గ్యాంగ్‌స్టర్ సునీల్ నాహక్ హత్య -
పోలీసుల అదుపులో తాడేపల్లి మైనర్ బాలిక హత్య కేసులో నిందితుడు
-
ఇంత చిన్న విషయానికి ముఖ్యమంత్రి రావాలా


