
భారత్, పాకిస్తాన్ (India vs pakistan) మధ్య జరుగుతున్న ఆసియా కప్ 2025 ఫైనల్లో (Asia cup 2025 Final) హైడ్రామా చోటు చేసుకుంది. సూపర్-4 మ్యాచ్‌లో పాక్ బౌలర్ హరీస్ రౌఫ్ (Haris Rauf) చేసిన ఓవరాక్షన్‌కు టీమిండియా పేసు గుర్రం జస్ప్రీత్ బుమ్రా (Jasprit Bumrah) కౌంటరిచ్చాడు.
BUMRAH HAS GIVEN A PERFECT MEDICINE TO RAUF...!!! 🥶💥 pic.twitter.com/DpItOev4aO
— Johns. (@CricCrazyJohns) September 28, 2025
ఇన్నింగ్స్ 18వ ఓవర్‌లో అద్భుతమైన యార్కర్‌తో హరిస్ రౌఫ్‌ను క్లీన్ బౌల్డ్ చేసిన బుమ్రా.. విమానం కూలిపోయినట్లు సంజ్ఞ చేశాడు. దీనికి సంబంధించిన వీడియో సోషల్‌మీడియాలో హల్‌చల్ చేస్తుంది. రౌఫ్‌కు సరైన సమాధానం చెప్పావంటూ భారత అభిమానులు బుమ్రాను ప్రశంసిస్తున్నారు.
సూపర్-4 మ్యాచ్‌లో రౌఫ్ ఫీల్డింగ్ చేసే సమయంలో విమానం క్రాష్ అయినట్లు సంజ్ఞలు చేశాడు. అలాగే ఆరు సంఖ్యను సూచిస్తూ చేతి వేళ్లను ప్రదర్శించాడు. రౌఫ్ చర్యలపై బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేయగా.. అతనికి 30 శాతం మ్యాచ్ ఫీజ్‌ను జరిమానాగా విధించారు.
అదే మ్యాచ్‌లో మరో పాక్ ఆటగాడు కూడా అభ్యంతరకంగా ప్రవర్తించాడు. ఓపెనర్ సాహిబ్‌జాదా ఫర్హాన్ హాఫ్ సెంచరీ పూర్తి చేసిన అనంతరం బ్యాట్‌ను గన్‌లా భావిస్తూ సెలబ్రేట్ చేసుకున్నాడు. ఇతనిపై కూడా బీసీసీఐ ఐసీసీకి ఫిర్యాదు చేసింది. అయితే ఫర్హాన్‌ను ఐసీసీ మందలింపుతో వదిలిపెట్టింది.
కాగా, నేటి ఫైనల్లో టాస్ ఓడి తొలుత బ్యాటింగ్‌కు దిగిన పాక్.. కుల్దీప్ యాదవ్ (4-0-30-4) ధాటికి 19.1 ఓవర్లలో 146 పరుగులకే కుప్పకూలింది. ఓపెనర్లు సాహిబ్‌జాదా ఫర్హాన్ (57), ఫకర్ జమాన్ (46) రాణించడంతో పాక్ తొలుత భారీ స్కోర్ చేసేలా కనిపించింది. 11.2 ఓవర్లలో కేవలం వికెట్ మాత్రమే కోల్పోయి 100 పరుగుల మార్కును తాకిన ఆ జట్టు.. భారత బౌలర్లు ఒక్కసారిగా లైన్‌లోకి రావడంతో తట్టుకోలేకపోయింది.
33 పరుగుల వ్యవధిలో ఆ జట్టు చివరి 9 వికెట్లు కోల్పోయింది. భారత బౌలర్లలో కుల్దీప్‌తో పాటు అక్షర్ పటేల్ (4-0-26-2), వరుణ్ చక్రవర్తి (4-0-30-2), బుమ్రా (3.1-0-25-2) కూడా సత్తా చాటారు. పాక్ ఇన్నింగ్స్‌లో ఓపెనర్లతో పాటు వన్ డౌన్ బ్యాటర్ సైమ్ అయూబ్ (14) మాత్రమే రెండంకెల స్కోర్ చేశారు.
చదవండి: Asia cup 2025 Final: సరికొత్త సంప్రదాయం