
ఆసియా కప్-2025 టోర్నమెంట్‌లో టీమిండియా యువ ఓపెనర్ అభిషేక్ శర్మ (Abhishek Sharma) అదరగొడుతున్నాడు. లీగ్ దశలో తొలుత యూఏఈపై ప్రతాపం చూపించిన ఈ ఎడమచేతి వాటం బ్యాటర్.. 16 బంతుల్లోనే 30 పరుగులు సాధించాడు.
మరోసారి విశ్వరూపం
ఆ తర్వాత పాకిస్తాన్‌తో మ్యాచ్ (IND vs PAK)లో అభిషేక్ శర్మ విజృంభించాడు. కేవలం 13 బంతుల్లోనే 31 పరుగులు సాధించి.. దాయాదికి తన సత్తా ఏమిటో చూపించాడు. అనంతరం ఒమన్‌పై 15 బంతుల్లోనే 38 పరుగులు చేసిన అభిషేక్ శర్మ.. తాజాగా సూపర్-4లో భాగంగా పాకిస్తాన్‌కు మరోసారి విశ్వరూపం చూపించాడు.
దుబాయ్ వేదికగా ఆదివారం నాటి మ్యాచ్‌లో అభిషేక్.. పాక్ బౌలింగ్‌ను ఉతికారేశాడు. 39 బంతులు ఎదుర్కొని.. ఆరు ఫోర్లు, ఐదు సిక్సర్ల సాయంతో 74 పరుగులు సాధించాడు. మరో ఓపెనర్ శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47)తో కలిసి తొలి వికెట్‌కు వందకు పైగా పరుగులు జతచేసి టీమిండియా విజయంలో కీలక పాత్ర పోషించాడు.
అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు
ఇలా కెరీర్ ఆరంభం నుంచి అద్భుత రీతిలో బ్యాటింగ్ చేస్తున్న అభిషేక్ శర్మ.. తాజాగా పాక్‌తో మ్యాచ్ సందర్భంగా ప్రపంచ రికార్డు సాధించాడు. అంతర్జాతీయ టీ20 ఫార్మాట్లో.. అతి తక్కువ బంతుల్లోనే 50 సిక్సర్లు పూర్తి చేసుకున్న తొలి క్రికెటర్‌గా చరిత్రకెక్కాడు. అంతేకాదు తక్కువ ఇన్నింగ్స్‌లో అత్యధిక సిక్సర్లు బాదిన ఆటగాడిగా ఎవిన్ లూయీస్ వరల్డ్ రికార్డును అభిషేక్ సమం చేశాడు.
ఇక మ్యాచ్ విషయానికొస్తే.. టీమిండియా పాక్‌ను ఆరు వికెట్ల తేడాతో ఓడించింది. తద్వారా సూపర్-4 దశలోనూ మరోసారి దాయాదికి ఓటమి రుచి చూపించింది. కాగా లీగ్ దశలో భారత్.. పాక్‌పై ఏడు వికెట్ల తేడాతో విజయం సాధించిన విషయం తెలిసిందే.
అతి తక్కువ బంతుల్లోనే అంతర్జాతీయ టీ20లలో 50 సిక్సర్లు బాదిన ఫుల్ మెంబర్ (టెస్టు హోదా) జట్ల ఆటగాళ్లు
అభిషేక్ శర్మ (ఇండియా)- 331 బంతుల్లోనే 50 సిక్సర్లు
ఎవిన్ లూయీస్ (వెస్టిండీస్)- 366 బంతుల్లో 50 సిక్సర్లు
ఆండ్రీ రసెల్ (వెస్టిండీస్)- 409 బంతుల్లో 50 సిక్సర్లు
హజ్రతుల్లా జజాయ్ (అఫ్గనిస్తాన్)- 492 బంతుల్లో 50 సిక్సర్లు
సూర్యకుమార్ యాదవ్ (ఇండియా)- 509 బంతుల్లో 50 సిక్సర్లు
అతి తక్కువ ఇన్నింగ్స్‌లో అంతర్జాతీయ టీ20లలో సిక్సర్లు బాదిన ఆటగాళ్లు (ఫుల్ మెంబర్ జట్లు)
అభిషేక్ శర్మ- 20 ఇన్నింగ్స్‌లో
ఎవిన్ లూయీస్- 20 ఇన్నింగ్స్‌లో
హజ్రతుల్లా జజాయ్- 22 ఇన్నింగ్స్‌లో
క్రిస్ గేల్- 25 ఇన్నింగ్స్‌లో
సూర్యకుమార్ యాదవ్- 29 ఇన్నింగ్స్‌లో.
చదవండి: ఛీ.. మీ బుద్ధిమారదా?.. బరితెగించిన పాక్ ఆటగాళ్లు!
కోత.. ఊచకోత 💥
Abhishek Sharma ఇచ్చిపడేసాడంతే! 🥁
చూడండి #INDvPAK లైవ్
Sony Sports Network TV Channels & Sony LIV లో#SonySportsNetwork #DPWorldAsiaCup2025 pic.twitter.com/0ufRZ5nDs6— Sony Sports Network (@SonySportsNetwk) September 21, 2025