
భారత్ నిన్న జరిగిన ఆసియా కప్ 2025 ఫైనల్ మ్యాచ్‌లో ఘన విజయ సాధించింది. ఈ విజయంలో కీలక పాత్ర పోషించిన యువ క్రికెటర్ తిలక్ వర్మ కీలకంగా వ్యవహరించారు. ఈ మ్యాచ్‌లో 69 పరుగులు చేసి టైటిల్ గెలిచేందుకు కృషి చేశారు. క్రీడా రంగంలో ఆయన విజయాలు ఎంతగానో ప్రశంసించదగినవి. అదే సమయంలో బిజినెస్ కోణంలో కూడా ఆయన ఎదుగుతున్న తీరు ఆసక్తికరంగా ఉంది. ఈ నేపథ్యంలో తిలక్ వర్మ లైఫ్‌స్టైల్, కార్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్ల గురించి తెలుసుకుందాం.
లగ్జరీ కార్లు, బ్రాండ్ ఎండార్స్‌మెంట్లు..
తిలక్ వర్మ వద్ద మెర్సిడెజ్ జెంజ్ ఎక్స్-క్లాస్ మోడల్ ఉంది. దీని ధర సుమారు రూ.1.7 కోట్లుగా ఉంది. దాంతోపాటు బీఎండబ్ల్యూ 7 సిరీస్ కారు కూడా ఉంది. దీని ధర దాదాపు రూ.1.8 కోట్లు. ఇటీవల తన తల్లిదండ్రులకు మహీంద్రా థార్ మోడల్ కారును బహుమతిగా ఇచ్చిన ఫొటోలు సామాజిక మాధ్యమాల్లో వైరల్ అయ్యాయి. ఐపీఎల్ మ్యాచ్ ఫీజులు, బీసీసీఐ కాంట్రాక్ట్‌ల ద్వారా ఈయన నెలవారీ ఆదాయం రూ.20–25 లక్షలుగా ఉందని అంచనా. 2025 ఐపీఎల్ వేలంలో రూ.8 కోట్లు సమకూరాయి. వివిధ సోషల్ మీడియా ప్లాట్‌ఫామ్‌ల ద్వారా వచ్చే ఆదాయం నెలకు రూ.40–50 లక్షలుగా ఉంది. ఇన్‌స్టాగ్రామ్‌లో(Instagram) ఈయనకు 3 మిలియన్ ఫాలోవర్స్ ఉన్నారు.
ఇదీ చదవండి: స్విస్ వాచ్‌లు, చాక్లెట్లు, సైకిళ్ల ధరలు తగ్గింపు
ఎండార్స్ చేస్తున్న బ్రాండ్లు (2025)
బిగ్‌బాస్కెట్
బాంబే షర్ట్ కంపెనీ
బూస్ట్ ఎనర్జీ