breaking news
brand endorsing
-
ధోని ఆస్తుల విలువ ఎంతో తెలుసా నెలకు ఎంత సంపాదిస్తున్నాడు..!
-
ఆ విషయంలో రణ్‌బీర్‌పై ఆలియాదే పైచేయి!
బాలీవుడ్ మోస్ట్ లవబుల్ కపుల్ ఆలిబాభట్, రణ్‌బీర్ కపూర్లు మూడుముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. దాదాపు పదేళ్లుగా ఆలియా సినిమాల్లో నటిస్తుండగా రణ్‌బీర్‌కి పదిహేనేళ్ల సిల్వర్ స్క్రీన్ చరిత్ర ఉంది. రణ్‌బీర్ కంటే ఐదేళ్లు వెనక ఇండస్ట్రీలోకి వచ్చినా బ్రాండ్ వాల్యూ, ఎండార్స్మెంట్లలో కాబోయే భర్తని వెనక్కి నెట్టింది ఆలియా భట్. డఫ్ అండ్ ఫెల్ఫ్స్ సెలబ్రిటీ బ్రాండ్ వాల్యుయేషన్ సంస్థ 2021 ఏడాదికి గాను ప్రకటించిన జాబితాలో ఆలియానే ముందుంది. ఆలియాభట్ బ్రాండ్ వాల్యూ విలువ 68.10 మిలియన్ డాలర్లు ఉండగా రణ్‌బీర్ కపూర్ బ్రాండ్ వాల్యూ 26.7 మిలియన్ డాలర్లుగా ఉంది. 2012లో స్టూడెంట్ ఆఫ్ ది ఇయర్ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఆలియాభట్ ఆ తర్వాత హైవే, రాజీ వంటి చిత్రాలతో తన ప్రత్యేకత చాటుకుని బాలీవుడ్ ప్రీమియం హీరోయిన్గా మారింది. ఇటీవల వచ్చిన కఠియావాడీ నటీగా ఆమెను మరింత ఎత్తులకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆలియాభట్ ఖాతాలో జెఎస్డబ్ల్యూ పెయింట్స్, బ్లెండర్స్ ప్రైడ, కోపికో వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమచారం మేరకు ప్రతీ ఎండార్స్మెంట్కి ఆలియాభట్ దాదాపు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు ఛార్జ్ చేస్తుండగా రణ్‌బీర్ కపూర్ రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడు. చదవండి: Celebrities Wedding Planners: సెలబ్రిటీల పెళ్లి.. ఇప్పుడదో ప్రొఫెషనల్ బిజినెస్.. -
జీవితంలో ఒక్క యాడ్ కూడా చేయని హీరో!
టాలీవుడ్ హీరోలు చిరంజీవి, పవన్ కళ్యాణ్, నాగార్జున, వెంకటేశ్, మహేశ్ బాబు, జూనియర్ ఎన్టీఆర్, ప్రభాస్, అల్లు అర్జున్, అఖిల్.. ఇలా చాలామంది ప్రకటనలలో కనిపిస్తారు. ఫలానా బ్రాండ్ అంటే తమకిష్టమని చెబుతారు. కేరళ సూపర్ స్టార్లు మమ్ముట్టి, మోహన్ లాల్ లాంటి వాళ్లు సబ్బులు, నగలు, బ్యాంకులు, చివరకు కూరల్లో వేసే మసాలా ప్రకటనలలో కూడా కనిపిస్తారు. కన్నడంలో పునీత్ రాజ్‌కుమార్, శివరాజ్ కుమార్ లాంటివాళ్లు పాలు, నగల బ్రాండ్లకు ప్రకటనలలో నటిస్తారు. తమిళనాడులో కమలహాసన్ లాంటి వాళ్లు సైతం ఈ మధ్యనే ప్రకటనలలో కనిపించారు. అయితే, ఒక వస్త్ర కంపెనీ ప్రకటనలో నటించగా వచ్చిన రూ. 16 కోట్లను హెచ్ఐవీ బాధిత పిల్లల కోసం కమల్ విరాళంగా ఇచ్చేశారట. ఇదంతా ఇప్పుడు ఎందుకు అనుకుంటున్నారా.. కబాలి సినిమాతో అంతర్జాతీయంగా కూడా బాక్సాఫీసులను షేక్ చేస్తున్న సౌతిండియా సూపర్ స్టార్ రజనీకాంత్ మాత్రం ఇప్పటివరకు ఒక్కటంటే ఒక్క ప్రకటనలో కూడా నటించలేదు. సినిమాలు తప్ప ఎలాంటి ప్రమోషనల్ కార్యక్రమంలోనూ పాల్గొనలేదు. 42 ఏళ్ల పాటు సాగిన కెరీర్లో 150కి పైగా సినిమాల్లో నటించిన రజనీ కాంత్ ఒక్క కనుసైగ చేస్తే చాలు.. ఆలిండియా టాప్ బ్రాండ్లు అన్నీ ఆయన కాళ్ల ముందు వాలిపోతాయి. కోట్లకు కోట్లు ఇస్తామంటూ ఆఫర్లు వెల్లువెత్తుతాయి. గత కొన్ని దశాబ్దాలుగా బాలీవుడ్ ఖాన్ల త్రయం షారుక్ ఖాన్, సల్మాన్ ఖాన్, ఆమిర్ ఖాన్‌లతో పాటు అమితాబ్ లాంటి సూపర్ స్టార్లు కూడా ప్రకటనలలో నటించిన కొన్ని కోట్లాది రూపాయలు సంపాదించారు. కానీ రజనీ మాత్రం తన కెరీర్ ఎంత పీక్ స్థాయిలో ఉన్నా, వరుసగా ఫ్లాప్‌లు చూసినా.. ఎలాంటి పరిస్థితుల్లోనూ ప్రకటనలను ఆశ్రయించలేదు. రెండు కోట్లకు పైగా ఇస్తామంటూ ఓ కోలా కంపెనీ రజనీ వద్దకు ఆఫర్ తీసుకెళ్దామని చూస్తే.. తలైవా వాళ్లకు కనీసం అపాయింట్మెంట్ కూడా ఇవ్వలేదట. రజనీ గుడ్‌విల్ ఏ కార్పొరేట్ బ్రాండ్ కంటే చూసినా చాలా ఎక్కువని, దేశంలోని ఏ నాయకుడి కన్నా, కార్పొరేట్ లీడర్ల కన్నా ఆయనకు ఎక్కువ విలువ ఉందని.. దాన్ని ఎవరూ డబ్బుతో కొలవలేరని ముంబైకి చెందిన బ్రాండ్ ఎండార్సర్ అనిర్బన్ బ్లా చెప్పారు.