ఆ విషయంలో రణ్‌బీర్‌పై ఆలియాదే పైచేయి! | Alia Bhatt is Ahead Of Ranbir Kapoor In Brand Value | Sakshi
Sakshi News home page

ఆ విషయంలో రణ్‌బీర్‌పై ఆలియాదే పైచేయి!

Apr 14 2022 3:54 PM | Updated on Apr 14 2022 5:02 PM

Alia Bhatt is Ahead Of Ranbir Kapoor In Brand Value - Sakshi

బాలీవుడ్‌ మోస్ట్‌ లవబుల్‌ కపుల్‌ ఆలిబాభట్‌, రణ్‌బీర్‌ కపూర్‌లు మూడుముళ్ల బంధంతో ఒక్కటవబోతున్నారు. దాదాపు పదేళ్లుగా ఆలియా సినిమాల్లో నటిస్తుండగా రణ్‌బీర్‌కి పదిహేనేళ్ల సిల్వర్‌ స్క్రీన్‌ చరిత్ర ఉంది. రణ్‌బీర్‌ కంటే ఐదేళ్లు వెనక ఇండస్ట్రీలోకి వచ్చినా బ్రాండ్‌ వాల్యూ, ఎండార్స్‌మెంట్లలో కాబోయే భర్తని వెనక్కి నెట్టింది ఆలియా భట్‌.

డఫ్‌ అండ్‌ ఫెల్ఫ్స్‌ సెలబ్రిటీ బ్రాండ్‌ వాల్యుయేషన్‌ సంస్థ 2021 ఏడాదికి గాను ప్రకటించిన జాబితాలో ఆలియానే ముందుంది. ఆలియాభట్‌ బ్రాండ్‌ వాల్యూ విలువ 68.10 మిలియన్‌ డాలర్లు ఉండగా రణ్‌బీర్‌ కపూర్‌ బ్రాండ్‌ వాల్యూ 26.7 మిలియన్‌ డాలర్లుగా ఉంది. 

2012లో స్టూడెంట్‌ ఆఫ్‌ ది ఇయర్‌ చిత్రం ద్వారా తెరంగేట్రం చేసిన ఆలియాభట్‌ ఆ తర్వాత హైవే, రాజీ వంటి చిత్రాలతో తన ప్రత్యేకత చాటుకుని బాలీవుడ్‌ ప్రీమియం హీరోయిన్‌గా మారింది. ఇటీవల వచ్చిన కఠియావాడీ నటీగా ఆమెను మరింత ఎత్తులకు తీసుకెళ్లింది. ప్రస్తుతం ఆలియాభట్‌ ఖాతాలో జెఎస్‌డబ్ల్యూ పెయింట్స్‌, బ్లెండర్స్‌ ప్రైడ​, కోపికో వంటి బ్రాండ్లు ఉన్నాయి. ఇండస్ట్రీ వర్గాల సమచారం మేరకు  ప్రతీ ఎండార్స్‌మెంట్‌కి ఆలియాభట్‌ దాదాపు రూ. 4 నుంచి 7 కోట్ల వరకు ఛార్జ్‌ చేస్తుండగా రణ్‌బీర్‌ కపూర్‌ రూ. 8 కోట్ల వరకు తీసుకుంటున్నాడు.

చదవండి: Celebrities Wedding Planners: సెలబ్రిటీల పెళ్లి.. ఇప్పుడదో ప్రొఫెషనల్‌ బిజినెస్‌..

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement