Ranbir Alia Marriage Planners: Details About Celebrities Wedding Planner Shaadi Squad - Sakshi
Sakshi News home page

Celebrities Wedding Planners: సెలబ్రిటీల పెళ్లి.. ఇప్పుడదో ప్రొఫెషనల్‌ బిజినెస్‌..

Apr 14 2022 12:59 PM | Updated on Apr 14 2022 2:42 PM

Details About Celebrities Ranbir Alia Wedding Planner Shaadi Squad - Sakshi

ఆలియాభట్‌ రణ్‌బీర్‌ కపూర్ల పెళ్లి ఇప్పుడు టాక్‌ ఆఫ్‌ ది టౌన్‌గా మారింది. సామాన్యుల ఇంట పెళ్లిలకే కనీసం నెల రోజుల ముందు నుంచి హడావుడి మొదలవుతుంది. కానీ ఆలియా రణ్‌బీర్‌ పెళ్లికి మూడు రోజుల ముందు వరకు కూడా బయటి ప్రపంచానికి తెలియదు. కానీ ఆర్నెళ్ల ముందుగానే పెళ్లి పనులు మొదలయ్యాయి. అవి చేపట్టింది షాదీ స్క్వాడ్‌ అనే వెడ్డింగ్‌ ప్లానర్‌ సంస్థ. ముంబైలో ఉన్న బాలీవుడ్‌, బిజినెస్‌ సెలబ్రిటీ పెళ్లిలు చేయడంతో ఈ సంస్థ పేరొందింది. 

పెళ్లంటేనే భారీ ఖర్చుతో కూడిన వ్యవహారం. ఒకప్పుడు పెళ్లి పనులు చూసుకునేందుకు కుటుంబ సభ్యులతో పాటు బంధుమిత్రులు, ఇరుగుపొరుగు సాయం చేసేవాళ్లు. కానీ ఇప్పుడది వెడ్డింగ్‌ ప్లానర్‌ పేరుతో కొత్త తరహా వ్యాపారానికి కేంద్రమైంది. ఇప్పుడయితే ఏకంగా కార్పోరేట్‌ కల్చర్‌ను సంతరించుకుంది. పక్కా ప్లానింగ్‌తో ప్రొఫెషనల్స్‌తో పెళ్లిని డిజైన్‌ చేస్తున్నారు. ఇలాంటి సర్వీసెస్‌ అందిస్తున్న వాటిలో షాదీ స్క్వాడ్‌ ఒకటి. ఇండియాలో సెలబ్రిటీల పెళ్లిలంటే టక్కున గుర్తొచ్చే వెడ్డింగ్‌ ప్లానర్‌గా నిలిచింది.

సౌరభ్‌ మల్హోత్రా, టీనా తివారీ, మనోజ్‌ మిత్రాలు సంయుక్తంగా షాదీ స్క్వాడ్‌ని స్థాపించారు. వీరిలో సౌరభ్‌ మల్హోత్రాకి గతంలో సినిమా నిర్మాణంలో బోలెడు అనుభవం ఉంది. సినిమా షూటింగ్‌ల సందర్భంగా సెట్లు వేయడం, నటీనటులను కోఆర్డినేట్‌ చేయడం వంటి పనులన్నీ దగ్గరుండి చూసుకునేవారు. దీంతో షాదీ స్క్వాడ్‌లో తెర వెనుక సౌరభ్‌ది కీలక పాత్ర. ఇక కల్యాణ వేడుకలకు సంబంధించి క్లంయిట్లతో మాట్లాడం, వారికి సంబంధించిన పనులు చక్కబెట్టడం టీనా తివారీ బాధ్యత. ఆర్థిక వ్యవహరాలు చక్కబెడుతూ.. చిన్న స్థాయి నుంచి దేశంలోనే సెలబ్రిటీల పెళ్లిలకు కేరాఫ్‌ అడ్రస్‌గా షాదీ స్క్వాడ్‌ను రూపుదిద్దడంలో మనోజ్‌ మిత్రాదే కీలక భూమిక. 

జీవితంలో ఎప్పటికీ మధుర జ్ఞాపకంగా గుర్తుంచుకునే వేడుక వివాహం. ఇందులో భాగమైన వధువరులు, వారి కుటుంబ సభ్యులు, బంధు మిత్రులకు ఎటువంటి ఒత్తిడి ఇవ్వకుండా కళ్యాణ వైభోగం ఫీలింగ్‌ ఇవ్వడం వెడ్డింగ్‌ ప్లానర్‌ కంపనీల ప్రధాన బాధ్యత. లాజిస్టిక్స్‌, ఎంటర్‌టైన్‌మెంట్స్‌, హాస్పిటాలిటీ, గెస్ట్‌మేనేజ్‌మెంట్‌, ఇన్విటేషన్లు, గిఫ్టులు, డెకరేషన్‌, ఫుడ్‌, బేవరేజెస్‌, డెస్టినేషన్స్‌, వెన్యూ మేనేజ్‌మెంట్‌, బడ్జెట్‌ మేనేజ్‌మెంట్‌ తదితర పనులన్నీ చూసుకుంటారు. టైమ్‌కి వచ్చి పెళ్లి వేడుకను తనివితీరా ఎంజాయ్‌ చేయమే మన పని.

ఇటీవల వార్తల్లో నిలిచిన ఫర్హాన్‌ అక్తర్‌ - శిబాని,  కత్రీనా కైఫ్‌ - విక్కీ కౌశల్‌,  వరుణ్‌ ధావన్‌ - నటాషా, అనుష్కా శర్మ - విరాట్‌ కోహ్లీ, నిక్‌జోనాస్‌ - ప్రియాంక చోప్రా వంటి ప్రముఖుల వివాహ వేడుకులు షాదీ స్క్వాడ్‌ చేపట్టింది. ముంబై, జైపూర్‌, జెస్మలేర్‌, కొచ్చి, గోవా, రతన్‌బోర్‌, మస్కట్‌, ఢిల్లీ, బెంగళూరు, థాయ్‌లాండ్‌, మస్కట్‌, ఇటలీ తదితర వేదికల్లో ఈ వేడుకలు నిర్వహించింది.

పెళ్లి వేడుకులను బుక్‌ చేసుకోవాలంటే కనీసం ఆరు నెలల ముందుగా మమ్మల్ని సంప్రదించడం మంచిదని షాదీ స్క్వాడ్‌ సూచిస్తోంది. అది కూడా పెళ్లి వేడుకలకు సంబంధించిన స్థలం మీరు ఎంపిక చేసుకుంటే. లేదంటే పెళ్లి థీమ్‌ మాత్రమే చెబితే కనీసం పది నెలల ముందుగా చెప్పాలంటోంది. ఒక్కసారి ప్రోగ్రామ్‌ ఫిక్స్‌ అయ్యాక... వివిధ అంశాలను బేరీజు వేసుకుని ఎ‍ప్పుడు, ఎక్కడ, ఏ థీమ్‌లో ఎంత బడ్జెట్‌లో వేడుకలు నిర్వహించాలనేది నిర్ణయిస్తారు. 

వెడ్డింగ్‌ ప్లానర్లలో షాదీ స్క్వాడ్‌తో పాటు వివాహ్‌ కంపెనీ, మోత్వాని తన్వీ అండ్‌ కంపెనీ, దేవికా సఖూజా, డిజైనర్‌ ఈవెంట్స్‌ , ది డోలీ డైయిరీ, అభినవ్‌ భగత్‌ ఈవెంట్స్‌, డ్రీమ్‌క్రాఫ్ట్స్‌, ది వెడ్డింగ్‌ డిజైన్‌ కంపెనీ వంటి సంస్థలు ఉన్నాయి. మన దగ్గర హైదరాబాద్‌, విశాఖపట్నం వంటి నగరాల్లో కార్పోరేట్‌ స్థాయిలో వెడ్డింగ్‌ ప్లానర్‌ సర్వీసులు అందుబాటులో ఉన్నాయి.
చదవండి: Ranbir Kapoor-Alia Bhatt Marriage: కాబోయే భార్యకు రణ్‌బీర్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌! అదేంటో తెలుసా?

Advertisement

Related News By Category

Related News By Tags

Advertisement
 
Advertisement

పోల్

Advertisement