Ranbir Kapoor-Alia Bhatt Marriage: కాబోయే భార్యకు రణ్‌బీర్‌ కాస్ట్‌లీ గిఫ్ట్‌! అదేంటో తెలుసా?

Ranbir Kapoor Gift Diamond Wedding Band To Alia Bhatt On Their Wedding - Sakshi

Ranbir Kapoor Costly Gift To Alia Bhatt On Wedding: బాలీవుడ్‌ ప్రేమ జంట రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ పెళ్లి వేడుకలు షురూ అయ్యాయి. ముంబై బాంద్రాలోని రణ్‌బీర్‌ ఇంటిలో నేడు (గురువారం) వీరిద్దరి వివాహం జరగనుంది. పెళ్లి వేడుకల్లో  భాగంగా బుధవారం ఉదయం రణ్‌బీర్‌–ఆలియా ముందుగా పితృపూజ చేశారు. ఆ తర్వాత మెహందీ ఫంక్షన్‌  మొదలుపెట్టారు. బుధవారం రాత్రి సంగీత్‌ ఫంక్షన్‌  జరిగింది. ఇప్పటికే రణ్‌బీర్, ఆలియా కుటుంబాలకు చెందిన కీలక సభ్యులంతా రణ్‌బీర్‌ ఇంటికి చేరుకున్నారు. దాదాపు 50 మంది ఇరు కుటుంబ సభ్యుల మధ్య వీరి వివాహం జరగనుంది. 

చదవండి: స్పెషల్‌ హీరోయిన్‌.. సో స్సెషల్‌

కాబోయే భార్యకు రణ్‌బీర్‌ స్పెషల్‌ గిఫ్ట్‌
వజ్రాల బ్యాండ్‌... ఆలియా కోసం రణబీర్‌ ప్రత్యేకంగా ఓ బహుమతి తయారు చేయించారట. 8 వజ్రాలు పొదిగిన ఖరీదైన వెడ్డింగ్‌ బ్యాండ్‌ అది. పెళ్లిలో ఆలియా తన చేతికి ఆ బ్యాండ్‌ ధరించనున్నారు. కాగా కపూర్‌ ఇంటి కుటుంబానికి 8 లక్కీ నంబర్‌ అట. అందుకే కాబోయే శ్రీమతికి ఎనిమిది వ్రజాలు పొదిగిన బ్యాండ్‌ని రణ్‌బీర్‌ బహూకరించి ఉంటారు.

రొమాంటిక్‌ సాంగ్‌... రణ్‌బీర్‌ కపూర్, ఆలియా భట్‌ జంటగా అయాన్‌  ముఖర్జీ దర్శకత్వంలో రూపొందిన సినిమా ‘బ్రహ్మాస్త్ర’. ఇందులో అమితాబ్‌ బచ్చన్, నాగార్జున, డింపుల్‌ కపాడియా కీలక పాత్రలు పోషించారు. మూడు భాగాలుగా ఈ చిత్రం విడుదల కానుంది. రణ్‌బీర్, ఆలియా వివాహం సందర్భంగా ‘బ్రహ్మాస్త్ర’ తొలి భాగం నుంచి ‘కేసరియా...’ అంటూ సాగే రొమాంటిక్‌ సాంగ్‌ను విడుదల చేసి, కాబోయే దంపతులకు చిత్రబృందం శుభాకాంక్షలు తెలియజేసింది.

చదవండి: అందుకే మీకు చరణ్‌ డామినేషన్‌ ఎక్కువ ఉందనిపిస్తుంది

Read latest Movies News and Telugu News | Follow us on FaceBook, Twitter, Telegram



 

Read also in:
Back to Top