
ఆసియా కప్ 2025లో భాగంగా నిన్న (సెప్టెంబర్ 19) జరిగిన మ్యాచ్‌లో భారత్ పసికూన ఒమన్‌పై 21 పరుగుల తేడాతో విజయం సాధించింది. ఈ గెలుపుతో టీమిండియా ఓ చారిత్రక రికార్డును సొంతం చేసుకుంది. అంతర్జాతీయ టీ20 క్రికెట్‌లో అత్యధిక దేశాలపై (19) విజయాలు సాధించిన జట్టుగా రికార్డు నెలకొల్పింది. ఈ మ్యాచ్‌కు ముందు ఈ రికార్డు భారత్, పాకిస్తాన్ (18) పేరిట సంయుక్తంగా ఉండేది.
అంతర్జాతీయ టీ20ల్లో అత్యధిక దేశాలపై విజయాలు సాధించిన జట్లు
భారత్- 19 దేశాలు (166 విజయాలు)
పాకిస్తాన్- 18 దేశాలు (156 విజయాలు)
న్యూజిలాండ్- 17 దేశాలు (123 విజయాలు)
ఆస్ట్రేలియా- 16 దేశాలు (119 విజయాలు)
సౌతాఫ్రికా- 15 దేశాలు (112 విజయాలు)
ఇంగ్లండ్- 15 దేశాలు (110 విజయాలు)
అంతర్జాతీయ టీ20ల్లో భారత్ టెస్ట్ హోదా కలిగిన దేశాలతో పాటు చాలా అసోసియేట్ సభ్య దేశాలను మట్టికరిపించింది.
టీ20ల్లో టీమిండియా విజయాలు నమోదు చేసిన దేశాలు
ఆస్ట్రేలియా- 32 మ్యాచ్‌ల్లో 20 విజయాలు
శ్రీలంక- 32 మ్యాచ్‌ల్లో 21 విజయాలు
సౌతాఫ్రికా- 31 మ్యాచ్‌ల్లో 18 విజయాలు
వెస్టిండీస్- 30 మ్యాచ్‌ల్లో 19 విజయాలు
ఇంగ్లండ్- 29 మ్యాచ్‌ల్లో 17 విజయాలు
న్యూజిలాండ్- 25 మ్యాచ్‌ల్లో 12 విజయాలు
పాకిస్తాన్- 14 మ్యాచ్‌ల్లో 10 విజయాలు
జింబాబ్వే- 13 మ్యాచ్‌ల్లో 10 విజయాలు
బంగ్లాదేశ్- 17 మ్యాచ్‌ల్లో 16 విజయాలు
ఆఫ్ఘనిస్తాన్- 9 మ్యాచ్‌ల్లో 7 విజయాలు
ఐర్లాండ్- 8 మ్యాచ్‌ల్లో 8 విజయాలు
హాంగ్‌కాంగ్- 1 మ్యాచ్‌లో 1 విజయం
నమీబియా- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు
యూఏఈ- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు
స్కాట్లాండ్- 1 మ్యాచ్‌లో 1 విజయం
నెదర్లాండ్స్- 2 మ్యాచ్‌ల్లో 2 విజయాలు
ఒమన్- 1 మ్యాచ్‌లో 1 విజయం
నేపాల్- 1 మ్యాచ్‌లో 1 విజయం
కెన్యా- 1 మ్యాచ్‌లో 1 విజయం
మొత్తంగా 19 దేశాలపై 250 మ్యాచ్‌లు ఆడి 166 విజయాలు సాధించిన భారత్, పొట్టి ఫార్మాట్‌లో అత్యధిక విజయాలు సాధించిన జట్టుగా, అత్యధిక విజయాల శాతం (66) కలిగిన జట్టుగా చలామణి అవుతుంది.
పొట్టి ఫార్మాట్‌లో రెండు ప్రపంచకప్‌లు (2007, 2024) గెలిచిన భారత్ ప్రస్తుతం ఈ ఫార్మాట్‌లో నంబర్ వన్ జట్టుగా (ర్యాంకింగ్స్‌లో) కొనసాగుతుంది. అలాగే ఈ ఫార్మాట్‌లో అన్ని విభాగాల్లో భారత ఆటగాళ్లే టాప్ ర్యాంక్‌ల్లో ఉన్నారు. బ్యాటింగ్‌లో అభిషేక్ శర్మ, బౌలింగ్‌లో వరుణ్ చక్రవర్తి, ఆల్‌రౌండర్ల విభాగంలో హార్దిక్ పాండ్యా నంబర్ వన్‌గా ఉన్నారు.