
ఆసియా కప్-2025లో (Asia Cup 2025) ఇవాళ (సెప్టెంబర్ 28) భారత్-పాకిస్తాన్ (India vs Pakistan) మధ్య మెగా ఫైనల్ జరుగనుంది. ఈ మ్యాచ్ దుబాయ్‌లోని అంతర్జాతీయ క్రికెట్ స్టేడియంలో భారతకాలమానం ప్రకారం రాత్రి 8 గంటలకు ప్రారంభం కానుంది.
ఈ టోర్నీలో భారత్, పాక్ తలపడటం ఇది మూడోసారి. అంతకుముందు గ్రూప్ దశ, సూపర్-4లో ఇరు జట్లు తలపడ్డాయి. ఈ రెండు పర్యాయాల్లో టీమిండియా పాక్‌ను చిత్తుగా ఓడించింది. నేడు జరుగబోయే ఫైనల్లోనూ అదే సీన్ రిపీట్ కాబోతుందని భారత అభిమానులు, విశ్లేషకులు అభిప్రాయపడుతున్నారు.
కాగా, నేటి భారత్-పాక్ ఫైనల్ మ్యాచ్‌ను భారతవ్యాప్తంగా 100కు పైగా పీవీఆర్ ఐనాక్స్ (PVR INOX) స్క్రీన్లపై ప్రత్యక్ష ప్రసారం చేయనున్నారు. ఈ అంశం ప్రస్తుతం సోషల్‌మీడియాలో ట్రెండ్ అవుతుంది.
ఇదే టోర్నీలో భారత్, పాక్ గ్రూప్ దశ, సూపర్-4లో తలపడినప్పుడు బాయ్‌కాట్ అన్న జనాలు.. ఫైనల్ మ్యాచ్ వచ్చేసరికి టికెట్ల కోసం ఎగబడుతున్నారు.
ఈ విషయాన్ని హైలైట్ చేస్తూ కొందరు నెటిజన్లు వ్యంగ్యమైన కామెంట్లు చేస్తున్నారు. బాయ్‌కాట్ గ్యాంగ్ టికెట్ బుకింగ్ గ్యాంగ్‌గా మారిందని ఎద్దేవా చేస్తున్నారు. భారత్-పాక్ మ్యాచ్‌ను బాయ్‌కాట్ చేయాలని ఉద్యమాలు చేసిన వాళ్లే, ఇప్పుడు టికెట్ల కోసం క్యూ లైన్లలో పడిగాపులు కాస్తున్నారంటూ సెటైర్లు వేస్తున్నారు.
భారత్-పాక్ మ్యాచ్ ప్రారంభానికి కొన్ని గంటల సమయం మాత్రమే ఉండగా దేశంలోని ప్రధాన నగరాల్లో స్క్రీనింగ్ హంగామా నడుస్తుంది. PVR INOX స్క్రీన్లపై దాయాదుల తుది సమరాన్ని వీక్షించేందుకు క్రికెట్ అభిమానులు ఎగబడుతున్నారు.
PVR INOX స్క్రీన్లతో పాటు దేశవాప్తంగా చాలా చోట్ల ప్రత్యేక స్క్రీన్లు ఏర్పాటు చేసి మ్యాచ్‌ను లైవ్ టెలికాస్ట్ చేస్తున్నారు. వీటికి సంబంధించిన టికెట్లు దక్కించుకునేందుకు అభిమానులు చిన్నపాటి యుద్దాలే చేస్తున్నారు.
చదవండి: ఇకపై అదే అర్హత.. వైభవ్ సూర్యవంశీ అలానే వచ్చాడు.. బీసీసీఐ కీలక నిర్ణయం