
ఆసియాకప్-2025లో భాగంగా పాకిస్తాన్‌తో జరిగిన ఫైనల్లో టీమిండియా స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ అద్భుతమైన ప్రదర్శన కనబరిచాడు. కుల్దీప్ తన స్పిన్ మ్యాజిక్‌తో పాక్ బ్యాటర్లకు చుక్కలు చూపించాడు. చెలరేగి ఆడుతున్న పాక్ బ్యాటర్ల దూకుడుకు కళ్లెం వేశాడు.
కుల్దీప్ యాదవ్ తన నాలుగు ఓవర్ల కోటాలో కేవలం 30 పరుగులు మాత్రమే ఇచ్చి 4 కీలక వికెట్లు పడగొట్టాడు. ఈ క్రమంలో కుల్దీప్ ఓ అరుదైన ఘనతను తన పేరిట లిఖించుకున్నాడు.
ఆసియాకప్ చరిత్రలో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్‌గా కుల్దీప్ నిలిచాడు. పాక్ బ్యాటర్ సైమ్ అయూబ్‌ను ఔట్ చేసినంతరం ఈ రికార్డును కుల్దీప్ తన ఖాతాలో వేసుకున్నాడు. ఇప్పటివరకు ఈ రికార్డు శ్రీలంక బౌలింగ్ దిగ్గజం లసిత్ మలింగ పేరిట ఉండేది.
తాజా మ్యాచ్‌తో మలింగ(33 వికెట్లు) ఆల్‌టైమ్ రికార్డును యాదవ్ బ్రేక్ చేశాడు. కుల్దీప్ తన ఆసియాకప్(వన్డే, టీ20)లో ఇప్పటివరకు 36 వికెట్లు పడగొట్టాడు. ఈ ఏడాది ఆసియాకప్‌లో ఏడు మ్యాచ్‌లు ఆడిన కుల్దీప్ మొత్తంగా 17 వికెట్లు పడగొట్టాడు.
అంతేకాకుండా ఒక ఆసియాకప్ ఏడిషన్‌లో అత్యధిక వికెట్లు సాధించిన భారత బౌలర్‌గా కూడా కుల్దీప్ రికార్డు స్పష్టించాడు. ఇంతకుముందు ఈ రికార్డు భారత మాజీ ఆల్‌రౌండర్ ఇర్ఫాన్ పఠాన్ పేరిట ఉంది. ఆసియాకప్-2004లో పఠాన్ 14 వికెట్లు పడగొట్టాడు.
తాజా ఎడిషన్‌లో 17 వికెట్లు సాధించిన కుల్దీప్.. పఠాన్‌ను అధిగమించాడు. కాగా ఫైనల్లో పాకిస్తాన్‌ను 5 వికెట్ల తేడాతో భారత్ చిత్తు చేసింది. దీంతో రికార్డు స్ధాయిలో తొమ్మిదోసారి ఆసియాకప్‌ను భారత్ కైవసం చేసుకుంది.
ఆసియాకప్‌లో అత్యధిక వికెట్లు పడగొట్టిన బౌలర్లు..
కుల్దీప్ యాదవ్(భారత్)-36
లసిత్ మలింగ(శ్రీలంక)-33
ముత్తయ్య మురళీధరన్(శ్రీలంక)-30
చదవండి: Asia Cup 2025: ట్రోఫీ, మెడల్స్‌ని ఎత్తుకెళ్లిన పీసీబీ చైర్మెన్.. బీసీసీఐ సీరియస్