
దుబాయ్: ఆసియా కప్ టి20 టోర్నీ సూపర్–4 దశలో భారత్ శుభారంభం చేసింది. ఆదివారం పాకిస్తాన్‌తో జరిగిన మ్యాచ్‌లో భారత్ 6 వికెట్ల తేడాతో ఘన విజయం సాధించింది.

టాస్ ఓడి ముందుగా బ్యాటింగ్‌కు దిగిన పాక్ 20 ఓవర్లలో 5 వికెట్ల నష్టానికి 171 పరుగులు చేసింది. సాహిబ్‌జాదా ఫర్హాన్ (45 బంతుల్లో 58; 5 ఫోర్లు, 3 సిక్స్‌లు) అర్ధ సెంచరీతో రాణించాడు.

అనంతరం భారత్ 18.5 ఓవర్లలో 4 వికెట్లకు 174 పరుగులు చేసి గెలిచింది. ‘ప్లేయర్ ఆఫ్ ద మ్యాచ్’ అభిషేక్ శర్మ (39 బంతుల్లో 74; 6 ఫోర్లు, 5 సిక్స్‌లు), శుబ్‌మన్ గిల్ (28 బంతుల్లో 47; 8 ఫోర్లు) చెలరేగి భారత్ విజయాన్ని సులువు చేశారు.


























