
టీ20 ఫార్మాట్‌లో తమకు తిరుగులేదని భారత జట్టు మరోసారి నిరూపించుకుంది. ఆసియాకప్-2025 విజేతగా టీమిండియా నిలిచింది. ఆదివారం జరిగిన ఫైనల్లో చిరకాల ప్రత్యర్థి పాకిస్తాన్‌పై ఐదు వికెట్ల తేడాతో విజయం సాధించిన భారత జట్టు.. రికార్డు స్థాయిలో తొమ్మిదో ఆసియా కప్ టైటిల్‌ను కైవసం చేసుకుంది.
దీంతో సామాన్యుని నుంచి ప్రధాని వరకు భారత సూర్య అండ్ కోపై ప్రశంసల వర్షం కురిపిస్తున్నారు. ఈ క్రమంలో భారత జట్టుకు భారత క్రికెట్ నియంత్రణ మండలి (BCCI) భారీ నజరానా ప్రకటించింది. ఈ చారిత్రత్మక విజయంలో భాగమైన ఆటగాళ్లు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల భారీ రివార్డు ఇవ్వనున్నట్లు బీసీసీఐ వెల్లడించింది.
మూడు దెబ్బలు.. అస్సలు సమాధానమే లేదు. ఆసియా కప్ చాంపియన్స్, కావాల్సిన సందేశం అందించాం. జట్టుకు, సహాయక సిబ్బందికి రూ. 21 కోట్ల బహుమతి అంటూ ఫైనల్ అనంతరం బీసీసీఐ ఎక్స్‌లో పేర్కొంది. కాగా ఈ ఖండాంతర టోర్నీలో మొత్తంగా మూడు సార్లు పాక్‌ను భారత్ చిత్తు చేసింది.
అదరగొట్టిన తిలక్..
ఇక భారత్ ఛాంపియన్స్‌గా నిలవడంలో హైదరాబాదీ తిలక్ వర్మది కీలక పాత్ర. 147 పరుగుల లక్ష్య చేధనలో తిలక్ మరుపురాని ఇన్నింగ్స్ ఆడాడు. లక్ష్య చేధనలో 20 పరుగులకే మూడు వికెట్లు కోల్పోయి పీకల్లోతు కష్టాల్లో పడ్డ జట్టును తిలక్ తన వీరొచిత ఇన్నింగ్స్‌తో ఆదుకున్నాడు.
తిలక్ 53 బంతుల్లో 3 ఫోర్లు, 4 సిక్స్‌లతో 69 పరుగులు చేసి ఆజేయంగా నిలిచాడు. దీంతో లక్ష్యాన్ని భారత్ 5 వికెట్లు కోల్పోయి 19.4 ఓవర్లలో అందుకుంది. తిలక్ వర్మకు ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్ అవార్డు దక్కగా.. స్పిన్నర్ కుల్దీప్ యాదవ్ ప్లేయర్ ఆఫ్‌ది సిరీస్‌గా నిలిచాడు.
చదవండి: Asia Cup 2025: పట్టు బట్టిన పీసీబీ చైర్మెన్.. ఊహించని షాకిచ్చిన భారత్