
ఆసియా కప్-2025 టోర్నమెంట్ లీగ్ దశను టీమిండియా అజేయంగా ముగించింది. ఆఖరిగా శుక్రవారం ఒమన్‌తో జరిగిన మ్యాచ్‌లో 21 పరుగుల తేడాతో గెలిచి.. గ్రూప్-ఎ టేబుల్ టాపర్‌గా తన స్థానాన్ని నిలుపుకొంది. తదుపరి సూపర్-4 దశలో తమ తొలి మ్యాచ్‌లో భాగంగా భారత్.. దాయాది పాకిస్తాన్‌తో తలపడేందుకు షెడ్యూల్ ఖరారైంది.
అయితే, దుబాయ్ వేదికగా ఆదివారం జరిగే ఈ మ్యాచ్‌కు ముందు టీమిండియాకు భారీ షాక్ తగిలింది. ఒమన్‌తో మ్యాచ్ సందర్భంగా ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ (Axar Patel Injury) గాయపడ్డాడు. భారత్ విధించిన లక్ష్యాన్ని ఛేదించే క్రమంలో ఒమన్ వన్‌డౌన్ బ్యాటర్ మహ్మద్ మీర్జా (33 బంతుల్లో 51) దూకుడగా ఆడాడు.
మైదానానికి బలంగా కొట్టుకున్న తల
ఈ క్రమంలో పదిహేనో ఓవర్లో శివం దూబే (Shivam Dube) బౌలింగ్‌లో మీర్జా బంతిని గాల్లోకి లేపగా.. మిడాఫ్ నుంచి పరిగెత్తుకుని వచ్చిన అక్షర్.. క్యాచ్ పట్టేందుకు విఫలయత్నం చేశాడు. ఈ క్రమంలో అదుపుతప్పి కిందపడిన అక్షర్ తల మైదానానికి బలంగా కొట్టుకుంది.
దీంతో ఫిజియో వచ్చి పరీక్షించి.. అతడిని మైదానం నుంచి తీసుకువెళ్లాడు. ఆ తర్వాత అక్షర్ మళ్లీ ఫీల్డింగ్‌కు రాలేదు. అయితే, ఈ విషయం గురించి స్పందించిన భారత జట్టు ఫీల్డింగ్ కోచ్ టి.దిలీప్ అప్‌డేట్ అందించాడు. అక్షర్ పటేల్ బాగానే ఉన్నాడని చెప్పాడు.
స్పష్టత లేదు
కానీ అక్షర్ గాయం తీవ్రతపై పూర్తి స్పష్టతనివ్వలేదు. ఈ నేపథ్యంలో పాకిస్తాన్‌తో సూపర్-4 మ్యాచ్‌కు అతడు అందుబాటులో ఉంటాడో లేదోనన్న సందిగ్దత నెలకొంది.
కాగా యూఏఈ వేదికగా టీ20 ఫార్మాట్లో జరుగుతున్న ఆసియా కప్ టోర్నీలో భారత్ లీగ్ దశలో మూడింటికి మూడు గెలిచింది. యూఏఈ, పాకిస్తాన్, ఒమన్‌లను ఓడించి అజేయంగా నిలిచింది. ఇక స్పిన్ ఆల్‌రౌండర్ అక్షర్ పటేల్ ఈ మెగా టోర్నీలో ఇప్పటి వరకు రెండు వికెట్లు తీయడంతో పాటు.. 26 పరుగులు సాధించాడు.
చదవండి: Asia Cup 2025 Super 4: సూపర్-4లో ఆడే జట్లు ఇవే.. షెడ్యూల్, టైమింగ్ వివరాలు