
సాక్షి, హైదరాబాద్: యువ క్రికెటర్ తిలక్ వర్మ తెలంగాణ సీఎం రేవంత్‌రెడ్డి(Revanth Reddy)ని కలిశారు. జూబ్లీహిల్స్‌లోని నివాసంలో మర్యాదపూర్వకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా ఆసియా కప్ ఫైనల్‌లో పాక్‌పై అద్భుతంగా ఆడి భారత్‌ను గెలిపించిన తిలక్‌ను.. సీఎం రేవంత్ సత్కరించి అభినందించారు. అనంతరం సీఎంకు తిలక్‌వర్మ బ్యాటును బహురించారు.
ఈ కార్యక్రమంలో మంత్రి వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శివసేనా రెడ్డి, శాట్స్ ఎండీ సోనిబాల దేవి, సిఎం ప్రిన్సిపల్ సెక్రటరీ శ్రీనివాసరాజు, ఖైరతాబాద్ డీసీసీ అధ్యక్షుడు రోహిన్ రెడ్డి, తదితరులు పాల్గొన్నారు.
యువ క్రికెటర్ తిలక్ వర్మ మర్యాదపూర్వకంగా కలిశారు.
ఆసియా కప్-2025 ఫైనల్ మ్యాచ్ లో పాక్ పై భారత్ విజయంలో కీలకపాత్ర పోషించిన తిలక్ వర్మను సత్కరించి, అభినందించాను. క్రికెట్ బ్యాట్ ను ఆయన నాకు బహూకరించారు.
కార్యక్రమంలో మంత్రి శ్రీ వాకిటి శ్రీహరి, శాట్స్ చైర్మన్ శ్రీ శివసేనా రెడ్డి… pic.twitter.com/o8x5b9Eusc— Revanth Reddy (@revanth_anumula) September 30, 2025