
ఆసియాప్-2025లో భారత్-పాకిస్తాన్ జట్ల మధ్య ఊహించని పరిణామాలు చోటు చేసుకున్న సంగతి తెలిసిందే. ఈ టోర్నీ అంతటా భారత జట్టు ఆటగాళ్లు పాక్ ప్లేయర్లతో అంటిముట్టనట్టే ఉన్నారు. కనీసం కరచాలనం చేసేందుకు కూడా ఇష్టపడలేదు. అంతేకాకుండా ఫైనల్ మ్యాచ్ అనంతరం ఆసియా క్రికెట్ కౌన్సిల్ (ACC) చీఫ్ మొహ్సిన్ నఖ్వీ చేతుల మీదగా ట్రోఫీని తీసుకోవడానికి కూడా భారత్ నిరాకరించింది.
నఖ్వీ పీసీబీ చీఫ్‌తో పాటు పాక్ మంత్రిగా ఉండడమే అందుకు కారణం. అయితే ఈ ఆసియాకప్‌లో జరిగిన సంఘటనలపై భిన్నాభిప్రాయాలు వ్యక్తమయ్యాయి. కొంతమంది భారత్‌కు సపోర్ట్ చేస్తే మరి కొతమంది పాక్‌కు మద్దతుగా నిలిచారు.
ఇదే విషయంపై ఇంగ్లండ్ మాజీ క్రికెటర్ మైఖేల్ అథర్టన్ కీలక వ్యాఖ్యలు చేశాడు. ఇరు దేశాల మధ్య సమస్యలు పరిష్కారం అయ్యే వరకు భారత్-పాకిస్తాన్ మ్యాచ్‌లను నిర్వహించవద్దని అంతర్జాతీయ క్రికెట్ కౌన్సిల్ (ఐసీసీ)కి అథర్టన్ సూచించాడు. అతడి వ్యాఖ్యలపై బీసీసీఐ అధికారి ఒకరు స్పందించారు.
"భారత్-పాకిస్తాన్ మధ్య సమస్యలు అంత సులువుగా పరిష్కరం కావు. బయట నుంచి వ్యక్తులు ఏదైనా మాట్లాడుతారు. ఏదైనా చెప్పినంత ఈజీ కాదు. అందుకు స్పాన్సర్లు, బ్రాడ్‌కాస్టర్లు అంగీకరిస్తారా? ప్రస్తుత పరిస్థితుల్లో టీమిండియానే కాదు ఏ ప్రధాన జట్టు అయినా టోర్నమెంట్ నుండి వైదొలిగితే తర్వాత స్పాన్సర్లను ఆకర్షించడం చాలా కష్టమని" సదరు అధికారి పేర్కొన్నారు.
కాగా ఈ ఏడాది ఆసియాకప్‌లో మూడు సార్లు పాక్-భారత్ జట్లు తలపడ్డాయి. మూడు మ్యాచ్‌లలోనూ పాక్‌ను టీమిండియా చిత్తు చేసింది. అయితే విన్నింగ్ ట్రోఫీ ఇప్పటివరకు ఇంకా భారత్ వద్ద చేరలేదు.
చదవండి: Prithvi Shaw: భారీ శతకంతో చెలరేగిన పృథ్వీ షా