పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రాపై భారత మాజీ క్రికెటర్, ప్రముఖ కామెంటేటర్ సుబ్రమణ్యం బద్రీనాథ్ సంచలన వ్యాఖ్యలు చేశాడు. ప్రస్తుతం భారత జట్టుకు బుమ్రా కంటే స్పిన్నర్ వరుణ్ చక్రవర్తి ఎక్కువ విలువైనవాడని సుబ్రమణ్యం అభిప్రాయపడ్డాడు. చక్రవర్తి గత కొంత కాలంగా అద్బుతంగా రాణిస్తున్నాడని, అందుకే టీ20ల్లో వరల్డ్ నంబర్ బౌలరయ్యాడని అతడు కొనియాడాడు.
కాగా ప్రస్తుతం ప్రపంచ క్రికెట్‌లో అత్యుత్తమ బౌలర్ అంటే అందరికి టక్కున గుర్తు వచ్చేది బుమ్రానే. అయితే బుమ్రా గత కొంతకాలంగా ఫిట్‌నెస్ సమస్యల వైట్ బాల్ క్రికెట్‌కు అంతగా ప్రాధన్యం ఇవ్వడం లేదు. అతడు ఎక్కువగా టెస్టు ఫార్మాట్‌పై దృష్టిసారించాడు. ఆస్ట్రేలియాతో వన్డే సిరీస్‌కు దూరమైన బుమ్రా, టీ20 సిరీస్‌లో ఆడాడు. ఇప్పుడు సౌతాఫ్రికాతో టెస్టు సిరీస్‌కు సిద్దంకానున్నాడు.
అయితే ఆ తర్వాత జరిగే వన్డే, టీ20 సిరీస్‌కు అందుబాటులో ఉంటాడో లేదో ఇంకా స్పష్టత లేదు. పొట్టి ప్రపంచకప్‌కు సమయం దగ్గరపడుతున్నందున సఫారీలతో టీ20లు బుమ్రా ఆడే అవకాశముంది. బుమ్రా ప్రస్తుతం టెస్టుల్లో నంబర్ వన్ బౌలర్‌గా కొనసాగుతున్నాడు. టీ20ల్లో అయితే బుమ్రా 29 ర్యాంక్‌లో ఉన్నాడు.
"వరుణ్ చక్రవర్తి ప్రపంచంలోనే నంబర్ వన్ టీ20 బౌలర్ ఎందుకు అయ్యాడో అతడి గణాంకాలే చెబుతున్నాయి. అతడు బుమ్రా కంటే ఎక్కువ విలువైనవాడు. పవర్ ప్లేలో కావచ్చు, డెత్ ఓవర్‌లలో పరుగులు కట్టడి చేయాలన్న కెప్టెన్‌కు గుర్తు వచ్చేది చక్రవర్తినే. అతడు ఇప్పుడు భారత జట్టులో ప్రధాన బౌలర్‌గా కొనసాగుతున్నాడు.
తన అంతర్జాతీయ కెరీర్ ఆరంభంలో పెద్దగా రాణించకపోయినా.. తన పునరాగమనంలో మాత్రం అద్భుతాలు చేస్తున్నాడు. టీ20 ప్రపంచకప్-2026లో అతడు భారత జట్టుకు కీలకం కానున్నాడు. వరుణ్ బంతితో మ్యాజిక్ చేస్తే భారత్‌కు తిరుగుండదు" అని స్టార్ స్పోర్ట్స్‌కు ఇచ్చిన ఇంటర్వ్యూలో వరుణ్ పేర్కొన్నాడు. కాగా వరుణ్, బద్రీనాథ్ ఇద్దరూ తమిళనాడుకు చెందిన క్రికెటర్లే.


