
టీమిండియా స్టార్ పేసర్ జస్ప్రీత్ బుమ్రా ఇంగ్లండ్ నుంచి స్వదేశానికి వచ్చేయనున్నాడు. వర్క్‌లోడ్‌లో భాగంగా ఇంగ్లండ్‌తో ఆఖరి టెస్టుకు దూరమైన బుమ్రాను జట్టు నుంచి బీసీసీఐ విడుదల చేసింది. భారత్‌కు చేరుకున్నాక బుమ్రా దాదాపు నెల రోజుల పైనా విశ్రాంతి తీసుకోనున్నాడు.
అతడు తిరిగి మళ్లీ సెప్టెంబర్‌లో మైదానంలో అడుగుపెట్టే అవకాశముంది. అయితే బుమ్రా విషయంలో సెలక్టర్లకు, టీమ్ మెనెజ్‌మెంట్‌కు మరోక చిక్కు వచ్చి పడింది. బుమ్రాను ఆసియా కప్(టీ20 ఫార్మాట్)లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలో సెలక్టర్లకు ఆర్ధం కావడం లేదు.
ఎందుకంటే ఆసియాకప్ సెప్టెంబర్ 9న ప్రారంభమై సెప్టెంబర్ 29న ముగుస్తుంది. అక్కడికి నాలుగు రోజుల తర్వాత అక్టోబర్ 2-6 వరకు భారత జట్టు వెస్టిండీస్‌తో అహ్మదాబాద్ వేదికగా తొలి టెస్టులో ఆడనుంది. ఒకవేళ భారత్ ఫైనల్‌కు చేరి, వెంటనే విండీస్‌తో తొలి టెస్టులో బుమ్రా ఆడాలంటే అది ఆసాధ్యమనే చెప్పుకోవాలి.
బుమ్రా ప్రస్తుతం అంత ఫిట్‌గా లేడు. ఇంగ్లండ్ టూర్‌లో కూడా కేవలం మూడు టెస్టులు మాత్రమే ఆడాడు. ఇప్పుడు ఇదే సెలక్టర్లకు, టీమ్ మెనెజ్‌మెంట్ తలనొప్పిగా మారింది. తాజాగా ఇదే విషయంపై ఓ బీసీసీఐ సీనియర్ అధికారి ఒకరు కీలక వ్యాఖ్యలు చేశారు.
బుమ్రా దూరం?
"బుమ్రా ఆసియాకప్‌లో ఆడి.. ఒకవేళ బారత్ ఫైనల్‌కు చేరితే అతడు అహ్మదాబాద్ వేదికగా వెస్టిండీస్‌తో జరిగే తొలి టెస్టుకు దూరంగా ఉండాల్సిందే. ఎందుకంటే అతడు తన వర్క్‌లోడ్‌ను మెనెజ్ చేయలేడు. అతడిని ఆసియాకప్‌లో ఆడించాలా లేదా వెస్టిండీస్‌తో టెస్టు సిరీస్‌కు ఎంపిక చేయాలా అన్నది సెలక్టర్లు నిర్ణయం తీసుకుంటారు.
అంతేకాకుండా నవంబర్‌లో దక్షిణాఫ్రికాతో రెండు టెస్టులు ఆడాల్సి వచ్చింది. కాబట్టి చీఫ్ సెలక్టర్ అజిత్ అగార్కర్, హెడ్ కోచ్ గౌతమ్ గంభీర్ ఏ నిర్ణయం తీసుకుంటారో వేచి చూడాలి. వారిద్దరికి ఇది ఒక సవాల్‌గా మారనుంది" అని బీసీసీఐ అధికారి పేర్కొన్నారు.
కాగా వెస్టిండీస్, దక్షిణాఫ్రికాతో సిరీస్‌లు ప్రపంచ టెస్ట్ ఛాంపియన్‌షిప్‌లో భాగంగా జరగనున్నాయి. డబ్ల్యూటీసీ పాయింట్ల పట్టికలో భారత్ ప్రస్తుతం నాలుగో స్దానంలో ఉంది. కాబట్టి ఈ రెండు సిరీస్‌లు టీమిండియాకు కీలకం కానున్నాయి. ఈ నేపథ్యంలో బుమ్రాను ఆసియాకప్‌నకు బదులుగా విండీస్, ప్రోటీస్ సిరీస్‌లో ఆడించే అవకాశముంది.
చదవండి: IPL 2026: గైక్వాడ్‌పై వేటు.. సీఎస్‌కే కెప్టెన్‌గా టీమిండియా స్టార్! అతడిపై కూడా కన్ను?