
లార్డ్స్ వేదికగా ఇంగ్లండ్‌తో జరుగుతున్న మూడో టెస్టులో టీమిండియా పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా(jasprit bumrah) నిప్పులు చెరుగుతున్నాడు. తన పేస్ బౌలింగ్‌తో ప్రత్యర్ధి బ్యాటర్లను బెంబేలెత్తిస్తున్నాడు. రెండో రోజు ఆటలో తొలుత ఇంగ్లండ్ కెప్టెన్ బెన్ స్టోక్స్‌ను అద్బతమైన బంతితో బోల్తా కొట్టించిన బుమ్రా.. ఆ తర్వాత జో రూట్(104), క్రిస్ వోక్స్‌ను పెవిలియన్‌కు పంపాడు.
కపిల్ దేవ్ రికార్డు బ్రేక్..
ఈ మ్యాచ్‌లో బుమ్రాకి ఇది నాలుగో వికెట్. ఈ క్రమంలో బుమ్రా ఓ అరుదైన ఘనతను తన పేరిట లఖించుకున్నాడు. ఇంగ్లండ్ గడ్డపై అత్యధిక టెస్టు వికెట్లు తీసిన రెండో భారత బౌలర్‌గా బుమ్రా రికార్డులకెక్కాడు. స్టోక్స్‌ను ఔట్ చేసిన అనంతరం ఈ ఫీట్‌ను బుమ్రా తన ఖాతాలో వేసుకున్నాడు.
బుమ్రా ఇప్పటివరకు ఇంగ్లండ్‌లో 47 టెస్టు వికెట్లు తీశాడు. ఇంతకుముందు ఈ రికార్డు టీమిండియా మాజీ కెప్టెన్ కపిల్ దేవ్ పేరిట ఉండేది. కపిల్‌దేవ్ తన కెరీర్‌లో ఇంగ్లండ్‌లో 13 మ్యాచ్‌లు ఆడి 43 వికెట్లు పడగొట్టాడు. తాజా ప్రదర్శనతో కపిల్‌దేవ్ ఆల్‌టైమ్ రికార్డును బుమ్రా బ్రేక్ చేశాడు.
ఇక అరుదైన ఫీట్ సాధించిన జాబితాలో టీమిండియా వెటరన్ పేసర్ ఇషాంత్ శర్మ(48) అగ్రస్దానంలో ఉన్నాడు. మరో రెండు వికెట్లు పడగొడితో ఇషాంత్‌ను బుమ్రా అధిగమిస్తాడు. ఇక తొలి ఇన్నింగ్స్‌లో 387 పరుగులకు ఇంగ్లండ్ ఆలౌటైంది.
251/4 ఓవర్ నైట్ స్కోర్‌తో రెండో రోజు ఆటను ప్రారంభించిన ఇంగ్లీష్ జట్టు.. అదనంగా 136 పరుగులు చేసి ఆలౌటైంది. జో రూట్(104) టాప్ స్కోరర్‌గా నిలవగా.. అతడితో పాటు బ్రైడన్ కార్స్(56), జేమీ స్మిత్(51), ఓలీ పోప్(44), స్టోక్స్(44) రాణించారు. భారత బౌలర్లలో జస్ప్రీత్ బుమ్రా ఐదు వికెట్లు పడగొట్టగా.. నితీశ్, సిరాజ్ తలా రెండు వికెట్లు సాధించారు.
చదవండి: రోహిత్ శర్మకు భారీ షాక్!?.. వన్డే కెప్టెన్‌గానూ గిల్?