ఈడెన్ గార్డెన్స్ వేదికగా దక్షిణాఫ్రికాతో జరుగుతున్న తొలి టెస్టులో భారత పేస్ గుర్రం జస్ప్రీత్ బుమ్రా నిప్పులు చెరుగుతున్నాడు. అద్బుతమైన యార్కర్లు, ఇన్‌స్వింగర్స్‌తో ప్రోటీస్ బ్యాటర్లను ముప్పు తిప్పలు పెడుతున్నాడు. సౌతాఫ్రికా ఓపెనర్లు రియాన్ రికెల్టన్, ఐడైన్ మార్‌క్రమ్ ఇద్దరిని బుమ్రా వరుస క్రమంలో పెవిలియన్‌కు పంపాడు. అయితే ప్రోటీస్ ఇన్నింగ్స్ 13 ఓవర్‌లో జస్ప్రీత్ బుమ్రా, వికెట్ కీపర్ రిషబ్ పంత్ మధ్య సరదా సన్నివేశం చోటు చేసుకుంది.
ఏమి జరిగిందంటే?
13 ఓవర్‌లో మార్‌క్రమ్ ఔటయ్యాక క్రీజులోకి వచ్చిన సౌతాఫ్రికా కెప్టెన్ బవుమా.. బుమ్రా బౌలింగ్‌ను ఎదుర్కొనేందుకు ఇబ్బంది పడ్డాడు. ఆ ఓవర్‌లో ఆఖరి బంతిని జస్ప్రీత్ గుడ్ లెంగ్త్ డెలివరీగా సంధించాడు. ఆ డెలివరీని ప్రోటీస్ కెప్టెన్ డిఫెన్స్ ఆడేందుకు ప్రయత్నించాడు.
కానీ బంతి మిస్స్ అయ్యి అతడి ప్యాడ్‌కు తాకింది. దీంతో బౌలర్‌తో పాటు భారత ఫీల్డర్లు ఎల్బీగా అప్పీల్ చేశారు. అంపైర్ మాత్రం నాటౌట్ అంటూ తల ఊపాడు. బుమ్రా మాత్రం ఖచ్చితంగా వికెట్లకు తాకుతుందన్న నమ్మకంగా కన్పించాడు.
అయితే బంతి మరీ ఎత్తులో తాకిందా లేదా అని చర్చించడానికి రిషబ్ పంత్ వద్దకు బుమ్రా వెళ్లాడు. మిగితా ఆటగాళ్లంతా స్టంప్‌ల దగ్గర గుమిగూడారు. ఇదే విషయాన్ని పంత్‌ను బుమ్రా అడిగాడు. పంత్ కూడా కొంచెం పైకి వెళ్తుందని సూచించాడు. కెప్టెన్ గిల్ కూడా శుభ్‌మన్ గిల్ రివ్యూ తీసుకోవడానికి అంతగా సుముఖత చూపలేదు.
దీంతో “క్రీజులో ఉన్నది బావుమా” కదా అంటూ బుమ్రా బౌలింగ్ చేసేందుకు తన ఎండ్‌కు వెళ్లిపోయాడు. ఈ సందర్భంగా ఓ అసభ్య పదాజాలన్ని కూడా బవుమా వాడాడు. దీంతో అంతా ఒక్కసారిగా నవ్వుకున్నారు. ఇదంతా స్టంప్ మైక్‌లో రికార్డు అయింది. కాగా దక్షిణాఫ్రికా కెప్టెన్ పొట్టిగా ఉంటాడని ఉద్దేశ్యంతో బుమ్రా ఈ కామెంట్స్ చేశాడు. అతడి హైట్ తక్కువగా ఉండడంతో బంతి మరీ ఎత్తులో వెళుతుందేమో అనే డౌట్‌తో బుమ్రా రివ్యూకు వెళ్లలేదు. బుమ్రా సందేహమే నిజమైంది.
రిప్లేలో బంతి స్టంప్స్ మిస్ అవుతున్నట్లు తేలింది. ఇందుకు సంబంధించిన వీడియో ప్రస్తుతం సోషల్ మీడియాలో వైరలవుతోంది. ఇది చూసిన నెటిజన్లు బుమ్రా ప్రవర్తనపై సీరియస్ అవుతున్నారు. పొట్టిగా ఉన్న బవుమాను బుమ్రా ఎగతాళి చేశాడని, ఇది అస్సలు ఊహించలేదని కామెంట్లు పెడుతున్నారు.
మరి కొంతమంది ఇది బుమ్రా సరదాగా అన్నాడని, సీరియస్ తీసుకోవాల్సిన అవసరములేదని మద్దతుగా నిలుస్తున్నారు. సాధారణంగా బుమ్రా మైదానంలో చాలా సైలెంట్‌గా ఉంటాడు. వికెట్ సెలబ్రేషన్స్ కూడా అతిగా చేసుకోడు. ప్రత్యర్ధి బ్యాటర్లను హేళన చేయడం, రెచ్చగొట్టే వ్యాఖ్యలు వంటివి బుమ్రా ఎప్పుడూ చేయలేదు. కానీ ఈ మ్యాచ్‌లో మాత్రం కాస్త అసహనానికి బుమ్రా లోనయ్యాడు.
చదవండి: పాకిస్తాన్‌కు ఐసీసీ భారీ షాక్..
— Pulga (@Lap_alt) November 14, 2025


